మార్గదర్శి సంస్థ వినియోగదారులకు చెల్లించాల్సింది రూ.1450కోట్లు అయితే, ఉన్నసొమ్ము రూ.2,750కోట్లు
• మార్గదర్శిలో తమకు అన్యాయం జరిగిందని ఒక్కరైనా జగన్ కు, అతని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా?
• తన అవినీతి, అక్రమాలు, దోపిడీని రామోజీరావు బయటపెడుతున్నాడన్న అక్కసుతోనే జగన్ మార్గదర్శిపై తప్పుడుకేసులు పెట్టిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డికూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ని అడ్డంపెట్టుకొని, రామోజీరావుపై, మార్గదర్శిపై తప్పుడుఆరోపణలు చేయించి చివరకు ఏమీనిరూపించలేక మిన్నకుండిపోయాడు : పత్తిపాటి పుల్లారావు.
• ఒక సామాజికవర్గంపై జగన్ కు ఉన్న కక్ష, ఈర్ష్యఅసూయలకు నిద్శనమే రామోజీరావు, ఆయనసంస్థలపై పెడుతున్న తప్పుడుకేసులు. విశాఖఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేనందుకు సిగ్గుపడుతూ, జగన్ తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేయాలి : పుల్లారావు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి , పత్తిపాటి పుల్లారావు
అసమర్థపాలన ఆఖరి అంకానికి చేరినా జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వం ఇంకా తగ్గలేదని, ఇసుక, మద్యం, ఖనిజాలు, ఇతరసహజవనరులన్నీదోచుకుంటూ లక్షలకోట్లు కొల్లగొడు తు న్న జగన్, అతనిప్రభుత్వం సిగ్గు, శరంలేకకుండా భారతదేశం గర్వించదగ్గ ప్రముఖుడైన రామోజీరావుని తప్పుపట్టడం చూస్తుంటే ఏనుగువెళ్తుంటే, కుక్కలు అరిచినట్టుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో ఆయన సోమవారం మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారిమాటల్లోనే …
రామోజీరావు కంపెనీలు, వ్యాపారాలు జగన్ కంపెనీలు వ్యాపారాల్లా అవినీతిసొమ్ముతో రాత్రికిరాత్రి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినవి కావు
“రామోజీరావుగారికి దేశంలోనే మంచిపేరుంది. వ్యాపారవేత్తగా, సినీనిర్మాతగా, ఈనాడు, మార్గదర్శి, రామోజీఫిల్మ్ సిటీ నిర్వాహకుడిగా ఎంతో గొప్పపేరు ప్రఖ్యాతులు గడించారు. మార్గదర్శిసంస్థను ఎన్నోఏళ్ల నుంచి సమర్థవంతంగా చిన్నఫిర్యాదులేకుండా నిర్వహిస్తూ, రూ.2లక్షలమంది వినియోగదారుల మన్ననలతో రూ.3వేలకోట్లకు పైగా డిపాజిట్లు సేకరిం చారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూగా రామోజీరావుని, ఆయన వ్యాపారాల్ని తప్పుపట్టారు. కానీచివరకు ఏమీసాధించలేకపోయారు. కేవలం కక్షసాధిం పులు, తనఅవినీతిని, అరాచకాలను బయటపెడుతున్నాడనే జగన్ రామోజీరావుపై, ఆయన సంస్థలపై తప్పుడుకేసులు పెట్టించాడు. మార్గదర్శి వినియోగదారులకు ఆసంస్థ చెల్లించాల్సింది రూ.1450కోట్లుఅయితే, డిపాజిట్లతాలూకా సొమ్ము రూ.2,750కోట్లుఉంది. అదనంగా నిల్వసొమ్ముఉంటే కావాలనే చెల్లింపులు ఎగ్గొడుతున్నట్టు జగన్ అతనిప్రభుత్వం రామోజీరావుపై, ఆయనమార్గదర్శి సంస్థపై బురదజల్లుతోంది. ఒక్కరోజు కూడా ఆలస్యం చే యకుండా డిపాజిట్ దారులకు మార్గదర్శిసొమ్ము చెల్లిస్తుంది. మార్గదర్శిలో చిట్ కట్టిన సభ్యుడిగా ఆసంస్థకు వచ్చేలాభాల్లో కొంతభాగాన్ని తాను పొందాను. రామోజీరావు వ్యాపా రాలు జగన్ మాదిరి దొంగవ్యాపారాలు కావు. రామోజీరావు కంపెనీలు, సంస్థలు జగన్ కంపె నీల్లా సూట్ కేస్ కంపెనీలు, అవినీతిసొమ్ముతో పుట్టగొడుగుల్లా రాత్రికిరాత్రి పుట్టుకొచ్చినవి కావు.
రామోజీరావుని చులకనగా చూడటం జగన్ కే ప్రమాదకరం.
ఏనుగు కాళ్లు పట్టుకొని కిందపడేయడం కుక్క తరం కాదు
టీడీపీఅధినేత చంద్రబాబు, లోకేశ్, వారికుటుంబంపై, టీడీపీనేతలపై తప్పుడుకేసులు పెట్టిం చి, సిగ్గులేకుండా అవినీతి ఆరోపణలుచేసిన జగన్, చివరకు ఏమీనిరూపించలేక చతికిలబ డ్డాడు. చివరకు ఇప్పుడు రామోజీరావుపై తన విషాన్నికక్కుతున్నాడు. సీఐడీ సంస్థ తనచే తిలో ఉందని, దేశంగర్వించే వ్యక్తులపై కక్షసాధింపులకు పాల్పడటం జగన్ లాంటి అవినీతిప రుడు, అసమర్థుడికే చెల్లింది. రాష్ట్రపతిచేతులమీదుగా పద్మవిభూషణ్ సత్కారం పొందిన రామోజీరావుని చులకనగా చూడటం జగన్ కు, అతనిప్రభుత్వానికే ప్రమాదకరం. ఎవరు తప్పుచేసినా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉన్నదిఉన్నట్టు చెప్పడం రామోజీరావుకి, ఆయన మీడియాకు అలవాటు. టీడీపీతప్పుచేసినాకూడా ఆయన వదల్లేదు. నిజాన్ని నిర్భ యంగా చెబుతున్నందునే జగన్ ఈనాడుపై అక్కసువెళ్లగక్కుతూ, రామోజీరావుపై తప్పు డుకేసులు పెడుతున్నాడు. అధికారంవచ్చిందని నేడు అహంకారంతో విర్రవీగుతున్న జగన్, గతంలో రామోజీరావు కాళ్లుపట్టుకున్న విషయం ప్రజలకు తెలుసు. ఏనుగుకాళ్లు పట్టుకొని లాగి కిందపడేయటం కుక్కతరంకాదు. ఇప్పటికైనా రామోజీరావుగారి వయసు, అనుభవం, పలుకుబడిని గ్రహించి జగన్ తనతప్పుతెలుసుకొని ఆయన్ని క్షమాపణలుకోరాలి. జగన్ ప్ర భుత్వానికి ఇంకా 6నెలల సమయమే ఉంది. నవంబర్లోనే జగన్ ఎన్నికలకు వెళ్తాడంటున్నా రు. అధికారంపోయాక జగన్, అతనిమంత్రివరంలోని వారు, వైసీపీనేతలు, ముఖ్యమంత్రిని సమర్థిస్తూ అతనికి బాకాఊదే మీడియాసంస్థలు, అతనికి ఊడిగంచేసే అధికారులు అందరూ శిక్షింపబడతారు.” అని సత్యనారాయణమూర్తి తీవ్రస్వరంతో హెచ్చరించారు.
జగన్ పుట్టకముందే మార్గదర్శి సంస్థ ప్రారంభమైంది. తన అవినీతి, అక్రమాలు, దోపిడీని రామోజీరావు బయటపెడుతున్నాడన్న అక్కసుతోనే జగన్ మార్గదర్శిపై తప్పుడుకేసులు పెట్టిస్తున్నాడు. : పత్తిపాటి పుల్లారావు
జగన్ మాటలునమ్మేపరిస్థితిలో ప్రజలులేరు. జగన్ పుట్టకముందే మార్గదర్శి సంస్థ ప్రారంభమైంది. ప్రభుత్వంచేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలు, జగన్ అవినీతిని బయటపెడు తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారన్నఅక్కసుతోనే రామోజీరావుపై, మార్గదర్శిపై తప్పుడుకేసులుపెట్టారు. దేశవ్యాప్తంగా మార్గదర్శి సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. దానిలో తప్పులు జరుగుతున్నట్టు జగన్ ప్రభుత్వానికి ఎక్కడైనా ఒక్కఫిర్యాదు అందిందా? తాను జైలుకువెళ్లివచ్చాడు కాబట్టే, జగన్ రామోజీరావు లాంటి వ్యక్తిని కూడా దోషిగా చూపాలని చూస్తున్నాడు. రామోజీరావు మార్గదర్శకత్వంలో, శైలజాకిరణ్ మార్గదర్శి సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మార్గదర్శిని నమ్మిన ఖాతాదారులకు ఏనాడూ ఎలాంటి ఇబ్బందిలేకుండా సదరుసంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. జగన్ కు రోజులు దగ్గర పడ్డాయికాబట్టే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలకు తెగబడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ ని అడ్డంపెట్టుకొని, మార్గదర్శిపై తప్పుడుఆరోపణ లు చేశారు. కానీ చివరకు దేన్నీనిరూపించలేక చేతులేత్తేశారు. ఇప్పుడు జగన్ కూడా చివ రకు పరాభవం మూటకట్టుకోక తప్పదు. జగన్ కు, అతని ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది కాబట్టే రామోజీరావు లాంటి గొప్పవ్యక్తితో పెట్టుకున్నాడు. తానుతీసుకున్నగోతిలో జగన్మో హన్ రెడ్డే పడబోతున్నాడు. రామోజీరావు సామాజికవర్గంపై జగన్ కక్షసాధిపుంలకు పాల్పడుతున్నాడు అనడానికి మరోనిదర్శనం అమర్ రాజాసంస్థను రాష్ట్రంనుంచి తరిమి కొట్టడమే. రాష్ట్రప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా..రాక్షసపాలన నుం చి రాష్ట్రానికి ఎప్పుడు విముక్తి కల్గిద్దామాఅని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
విశాఖఉక్కు ప్రైవేటీకరణను ఆపలేని జగన్, తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. సింగరేణి కార్మికులు విశాఖఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తుంటే, జగన్ కు సిగ్గుగాలేదా?
ఎందరి త్యాగాలతోనే ఆవిర్భవించిన విశాఖఉక్కు ప్రైవేటీకరణపై జగన్ ఎందుకు నోరుమె దపడంలేదు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేని జగన్ తక్షణమే తనపదవికిరాజీనామా చేయాలి. పక్కరాష్ట్రంలోని సింగరేణి సంస్థ కార్మికులు, విశాఖఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ, తోటికార్మికులకు మద్ధతు తెలుపుతుంటే, జగన్ నిజంగా సిగ్గుపడాలి. విశాఖఉక్కుఫ్యాక్టరీని రక్షించడానికి కార్మికులకు న్యాయంచేయడానికి, ముఖ్యమంత్రిగా జగన్ చేసింది శూన్యం. కాబట్టి తక్షణమే జగన్ తనముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.” అని పుల్లారావు డిమాండ్ చేశారు.