Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నారై టీడీపీ ద్వారా డిగ్రీ చదువుకున్న 17 మందికి మంగళగిరి స్టార్ట్ అప్ కంపెనీలో ఉద్యోగాలు

చంద్రబాబు నాయుడు విజనరీ లో తెలుగుదేశం అనుబంధ విభాగమైన ఎన్నారై టీడీపీ సెల్ ద్వారా నిర్వహిస్తున్న ఎంపవర్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన 17 మంది డిగ్రీ చదువుకున్న వారికి మంగళగిరిలోనే ఇటీవల ప్రారంభమైన స్టార్ట్ అప్ కంపెనీ లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. గత నెలలో ఇదే విధంగా శిక్షణ పొందిన 25 మంది ఆ కంపెనీలో ఉద్యోగాలు చేస్తుండగా వారికి అదనంగా ఈ17 మంది ని కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఆ సంస్థలో మొత్తం 42 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ సెల్ అధినేత డా. రవి వేమూరి మాట్లాడుతూ, ఎన్నారై టిడిపి సెల్ ద్వారా ఎన్నో రకాల ట్రైనింగ్లు ఇవ్వడం దాని తర్వాత ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉపయోగించుకొని వారి పిల్లలను మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎంపవర్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్న ట్రైనింగ్స్ లను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలియజేశారు.

ప్రస్తుతం జరుగుతున్న టైనింగ్ మరియు ఉద్యోగ అవకాశాలు…
1. ఐటిఐ డిప్లమా చదువుకున్న వారికి ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషన్ టెక్నీషియన్ లో శిక్షణ. శిక్షణ పొందిన తర్వాత గల్ఫ్ దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పన.
2. BA, BCom, BSc, మొదలైన డిగ్రీలలో ఉత్తీర్ణులు ఆయన వారికి మంగళగిరిలోనే వివిధ స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు. ప్రస్తుతం 150 పోస్ట్ లకు పైగా అభ్యర్థులు అవసరం.
3. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ లో శిక్షణ. పైతాన్, జావా, డాటా ఎనలిటిక్స్ పై శిక్షణ జరుగుతుంది. వీరికి అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ లు ఇండియాలో స్థాపించిన కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది.

ఈ సెల్ ద్వారా నిర్వహించే ట్రైనింగ్ మరియు ఉద్యోగాలు కావలసినవారు www.nritdp.com ద్వారా గాని లేదా నేరుగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కైనా వచ్చి సంప్రదించవచ్చు.

LEAVE A RESPONSE