-ఇప్పటికే 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
-తాజాగా మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల ప్రకటన
-మొత్తం 13 పురస్కారాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం
-ఏప్రిల్ 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందజేత
-కేసీఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతి వల్లే..అవార్డులు…మంత్రి ఎర్రబెల్లిని, ఆయన టీమ్ ని అభినందించిన మంత్రలు కెటి రామారావు, హరీశ్ రావు
-సీఎం కెసిఆర్, కేటీఆర్ లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమా వల్లే ఈ అవార్డులు, వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-అవార్డుల రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు : మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణకు మరోసారి 5 అవార్డులు వచ్చాయి. 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకు తోడుగా, తాజాగా మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు లభించాయి. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహ్రా ప్రకటించారు. దీంతో కేంద్రం ప్రకటించిన పుసర్కారాలలో మొత్తం 13 పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఏప్రిల్ 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందజేస్తామని, సంబంధిత ప్రతినిధులను ఒక రోజు ముందుగా పంపించాలని ఆ లేఖలో కోరారు. ఇదిలావుండగా, కేసీఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతి వల్లే..అవార్డులు…మంత్రి ఎర్రబెల్లిని, ఆయన టీమ్ ని మంత్రలు కెటి రామారావు, హరీశ్ రావులు ట్విట్టర్ వేదికగా అభినందించారు. కాగా, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్, కేటీఆర్ లు, పల్లె ప్రగతి వల్లే ఈ అవార్డులు దక్కాయని, వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డుల రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ అవార్డులు – నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ – 2023
1. ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అవార్డు విభాగంలోకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి.
2. ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో ములుగు జిల్లా
3. స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో… గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం
4. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం
5. నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ – సర్టిఫికేట్ల విభాగం – గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ కు సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి ఎంపికైంది.