Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి లూటీ, అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై రూ.55,273 కోట్ల భారం

-రూ.3,082 కోట్ల 2021-22 కోనుగోళ్ల భారాన్ని వినియోగదారులపై మోపడం అన్యాయం
-జగన్ రెడ్డి తన బినామీలకు, క్విడ్ ప్రోకోలకు చెల్లించిన మొత్తాలను కూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్నాడు
-విశాఖ పారిశ్రామిక సదస్సు ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే
-యువత జగన్ రెడ్డిని ఎన్నటికీ నమ్మదు
-మాజీ విద్యుత్ శాఖా మాత్యులు కిమిడి కళావెంకట్రావు

జగన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని తన అవినీతికి, లూఠీకి ఒక అవకాశంగా మార్చుకున్నాడు. విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో వేలాది కోట్ల రూపాయల కాంట్రాక్టులను తన బినామీలకు, అస్మదీయులకు కట్టబెడుతూ సొంత లాభం చూసుకుంటూ విద్యుత్ వినియోగదారులను బలిచేస్తున్నాడు. 2021-22 వార్షిక సంవవత్సరంలో డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటును 2023-24 లో వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ డిస్కంలకు అనుమతి ఇవ్వడం దుర్మార్గం.

రూ.3,082 కోట్ల సర్ధుబాటు ఛార్జీలతో కలిపి మరో రూ.456 కోట్ల సరఫరా నష్టాలను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేయాలనుకోవడం అన్యాయం, అక్రమం. ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి, అవసరం లేకున్నా హిందుజాకు చెల్లించేందుకు రూ.1,234 కోట్లు చెల్లించి వినియోగదారులపై రూ.49,106 కోట్ల భారాలు మాపారు. అంతేకాకుండా తన బినామి కంపెనీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు విలువైన బిల్లులు చెల్లించారు. దీంతో జగన్ రెడ్డి నాలుగేళ్లలో ప్రజలపై మోపిన మొత్తం భారాలు రూ.55,273 కోట్లకు చేరుకున్నాయి.

వినియోగదారులపై ఇన్ని భారాలు మోపడానికి కారణం ఏంటి?
జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ డిస్కంలు తిరిగి లేవలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 2019 లో టిడిపి అధికారం దిగిపోయే నాటికి రూ.18,022 కోట్ల అప్పులు ఉన్న డిస్కంలు 2022 డిసెంబర్ నాటికి అవి రూ.50,004 కోట్లకు చేరుకున్నాయి. అంటే, జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో రూ.31,981 కోట్లు డిస్కంల పేరుతో అప్పులు చేశారు. ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ బకాయిలు రూ.31,277 కోట్లు చెల్లించాలి. 2019-22 మధ్య కాలంలో బహిరంగ మార్కెట్ లో రూ. 12,200 కోట్లుకు విద్యుత్ కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో కమీషన్ల కోసం రూ.60 వేలు ఖరీదు ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.1.30 వేలు పెట్టి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొన్నారు. మూడున్నరేళ్లలో కేవలం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,629 కోట్లు విలువైన బిల్లులు చెల్లించారు. హైదరాబాద్ లో ఉన్న హందుజా భూములను జగన్ రెడ్డికి క్విడ్ ప్రోకోలో కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఆ కంపెనీకి అవసరం లేకున్నా రూ.1234 కోట్లు అప్పు తెచ్చి చెల్లిస్తోంది. జగన్ రెడ్డి లూఠీ, అవినీతికి విద్యుత్ వినియోగదారులు బలి అవ్వాలా? డిస్కంలకు చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలపై ఈఆర్సీ దృష్టిపెట్టకుండా వినియోగదారులపై భారాలు మోపడం ఎంతవరకు న్యాయం?

విద్యుత్ రంగానికి జగన్ రెడ్డి చేసిందేమిటి:
నాలుగేళ్లలో విద్యుత్ రంగానికి జగన్ రెడ్డి చేసిందేమిటి? విశాఖ పారిశ్రామిక సదసులో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ విద్యుత్ రంగంపై అవాస్తవాలు వినిపించే ప్రయత్నం చేశాడు. గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. చంద్రబాబునాయుడు ఐదేళ్లలో 14,655 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పి ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి తీసుకెళ్లాడు. అందులో 7 వేల మెగావాట్ల సోలార్, విండ్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడిది. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులు చేయించాడు. మైలవరం సోలార్ ప్లాంట్ పై దాడి చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు. సోలార్, విండ్ పీపీఏలను రద్దు చేశాడు. వారు సరఫరా చేసిన విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. రెన్యువబుల్ ఎనర్జీలో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉండగా నేడు అధమ స్థానానికి పడిపోయింది. ప్రపంచ దేశాల ముందు మనం తలదించుకోవాల్సి వచ్చింది. ఏకంగా జపాన్ అంబాసిడర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి ఇటువంటి చర్యలు పెట్టుబడిదారుల విశ్వసాన్ని దెబ్బతీస్తాయని వాపోయారు. జగన్ రెడ్డి నాలుగేళ్లలో ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని లోటులోకి నెట్టాడు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యుత్ కోతలు. మన అవసరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనాల్సిన దుర్బర పరిస్థితి. వినియోగదారులకు అందిస్తున్న సేవలు అంతంత మాత్రమే. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంటు 6-7 గంటలు కూడా ఇవ్వడం లేదు.

రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి?
విద్యుత్ ఛార్జీలు పెంచి పవర్ హాలిడేలు ప్రకటిస్తే పరిశ్రమలు వస్తాయా? హైటెన్షన్ III(c) కేటగిరిలోని ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కు ఎన్నో ఏళ్ల నుంచి ఇస్తున్న విద్యుత్ రాయితీలను తొలగించాలని డిస్కంలు 2023-24 వార్షిక ఆదాయ వ్యయ నివేదికల్లో ప్రతిపాధించాయి. ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలు, పివి ఇగ్నాట్స్, సెల్ మ్యానుఫ్యార్చురింగ్ ఇండస్ట్రీలు, ఫాలీ సిలికాన్ ఇండస్ట్రీలు, ఐరన్, అల్యూమినియం లాంటి తదితర భారీ పరిశ్రమలకు రాయితీలు తొలగించడం పరిశ్రమలను ఆహ్వానించడమా? పారిశ్రామిక అభివృద్ది జరగాలని ఏ ప్రభుత్వమైనా పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తుంది, రాయితీలు ఇస్తుంది. పరిశ్రమలు వస్తే వందలు, వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. మెరుగైన జీవన ప్రమాణాలతో సామాజిక, ఆర్ధిక ఎదుగుదలకు దోహదపడుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోంది. కమీషన్ల కోసం పరిశ్రమలపై దాడులు చేసిన చరిత్ర జగన్ రెడ్డి ప్రభుత్వంది.

విశాఖ పారిశ్రామిక సదస్సు ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే:
నాలుగేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోయిన జగన్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయని మేలుకుని పారిశ్రామిక సదస్సుల పేరుతో మరో మోసానికి తెరలేపారు. యువతను మరోసారి నమ్మించి గొంతు కోయాలనుకుంటున్నాడు. కానీ, జగన్ రెడ్డిని యువత ఎన్నటికీ నమ్మదు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాల లేక నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సిఎంఐఈ) వారు ఇచ్చిన నివేదిక ప్రకారం నవంబర్ 2022 నాటికి నిరుద్యోగం 9.0 శాతంకు చేరుకుంది. ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక ఆంధ్రప్రదేశ్ లో గత మూడేళ్లలో 21,575 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర కార్మిక, ఉఫాధి మంత్రి రామేశ్వర్ తేలి 19.12.2022 న వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీమెన్స్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల ద్వారా 2 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి 64 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అలాంటి స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో అవినీతి జరిగిందని వాటిని నిర్వీర్యం చేసాడు. ఒక్క కొత్త స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కూడా రాష్ట్రంలో పనిచేయడం లేదు.

LEAVE A RESPONSE