– ప్రతి క్యాంపులో కనీసం 75 యూనిట్ల బ్లడ్ డొనేషన్
– 18 వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, 21వ తేదీన మారథాన్, 25వ తేదీన ధీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కార్యక్రమాలు
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ విధివిధానాలు ప్రజల దగ్గర ఉండే దిశగా స్పష్టంగా ఉన్నవి. ప్రజల సమస్యలను ఎప్పుడూ తెలుసుకొని, వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తూ, నిఖార్సైన చర్యలు తీసుకుంటుంది. ఇతర రాజకీయ పార్టీల విధానాన్ని పోల్చితే… వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎన్నికలు పూర్తైన తర్వాత ప్రజల సమస్యలపై పట్టించుకోరు. కానీ భారతీయ జనతా పార్టీలో ఇలాంటి అలసత్వం ఉండదు.
ప్రధానమంత్రి మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రంలో కనీసం 75 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆలోచనకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆమోదం తెలిపారు. ప్రతి క్యాంపులో కనీసం 75 యూనిట్ల బ్లడ్ డొనేషన్ సాధించాల్సిన లక్ష్యంగా నిర్ణయించాం.
సెప్టెంబర్ 17న బ్లడ్ డొనేషన్ క్యాంపులు, 18 వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, 21వ తేదీన మారథాన్, అదేవిధంగా 25వ తేదీన ధీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాం. దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డు పొందిన వ్యక్తులను ప్రత్యేకంగా సన్మానిస్తాం.
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని, ఆత్మనిర్భర్ భారత్ భావనను ప్రోత్సహిస్తూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ప్రతి వ్యక్తి ఖాదీ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరుతాం.
బిజెవైఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న ప్రత్యేక మారథాన్ – ‘3K NAMO YUVA RUN – FOR A DRUG FREE NATION’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మారథాన్ ద్వారా దేశ యువతలో డ్రగ్స్ వ్యసనాన్ని నిరోధించి, మత్తులో కాకుండా సరైన మార్గంలో నడిపించి, భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీ నేషన్‌గా తీర్చిదిద్దాలని అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం. డ్రగ్స్ వ్యసనాన్ని నిరోధించడం, యువతను మత్తులోకి కాకుండా సరైన మార్గంలో నడిపించి, దేశాన్ని డ్రగ్ ఫ్రీ నేషన్‌గా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యం.
బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం (ఎన్టీఆర్ మార్గం) నుండి ప్రారంభమై, నెక్లెస్ రోడ్డులో యూ-టర్న్ తీసుకొని తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముగుస్తుంది.
పోస్టర్స్‌లో ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా వ్యక్తిగత వివరాలు నమోదు చేయవచ్చు. మీ టీ షర్ట్ సైజ్‌ను కూడా నమోదు చేయడం ద్వారా, అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా టీ షర్ట్ అందజేయబడుతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, స్వచ్ఛంద భావనతో, సేవా ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.