ఇండియాలో కొనసాగుతున్న గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్..

-ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలో 86 శాతం మంది!

కరోనా మహమ్మారి ఉద్యోగుల జీవన విధానాలను, వారి ఆలోచనాశైలిని సమూలంగా మార్చేసింది. కోవిడ్ సమయంలో గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ వచ్చింది. జీవన సమతుల్యత, ఆనందంగా గడపడం కోసం ఉద్యోగులు తక్కువ జీతాలను తీసుకోవడానికి, ప్రమోషన్లను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. రానున్న 6 నెలల్లో భారత్ లో ప్రస్తుత ఉద్యోగాలకు రాజీనామా చేసే యోచనలో 86 శాతం మంది
quit-job ఉద్యోగులు ఉన్నారని రిక్రూట్ మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ తెలిపింది. అన్ని రంగాల్లో ఈ ట్రెండ్ కనపడుతుందని… సీనియర్ ఉద్యోగులు, ఎక్కువ వయసున్న ఉద్యోగులు కూడా ఈ ట్రెండ్ ను అనుసరిస్తారని చెప్పింది. వేతనం, పని చేస్తున్న పరిశ్రమ మార్పు, కంపెనీపై అసంతృప్తి వంటివి రాజీనామాలకు కారణంగా పేర్కొంది.

Leave a Reply