-రాష్ట్రం రావణ కాష్ణంలా తయారైంది
– ఆడబిడ్డలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు
– ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత ఒక అన్నగా నేను తీసుకుంటా
– రేపు ప్రభుత్వం మారితే..మీరు ఈ భూమ్మీదే తిరగాలి ఖబడ్డార్
– అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?
– పోలీసు వ్యవస్ధకి సిగ్గనిపించటం లేదా?
– వైసీపీని బంగాళ ఖాతంలో పడేయాలి
– బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో హత్యకు గురైన 10 వ తరగతి విద్యార్ది అమర్నాధ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-పార్టీ తరుపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించిన టీడీపీ అధినేత
స్థానిక ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారంటే.. :
తమ అక్కను ఎందుకు వేధించారని ప్రశ్నించినందుకు , అమర్నాధ్ అనే విద్యార్దిని అతి కిరాతంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఘటన జరిగిన 7 గంటల తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు చూసి పోలీసులు అప్పుడు స్పందించారు. బాధిత కుటుంబ స్ధానిక సీఐకు ఫిర్యాదు చేస్తే వెంటనే ఎందుకు స్పందించలేదు?
ఘటన తర్వాత నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కౌంటర్ కేసు పెట్టేందుకు ప్రయత్నించారు. తనను చంపిన వారి పేర్లు చనిపోయే ముందు అమర్నాధ్ స్పష్టంగా చెప్పాడు. అక్కను కాపాడుకోబోయి తమ్ముడు సజీవ దహనమయ్యాడు, ఇంత ఘోరం జరిగితే సీఎం ఎందుకు రాలేదు? బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? సీఎంకి ఆడబిడ్డలున్నారు…ఇలాంటి పరిస్ధితి వాళ్లకెదురైతే నీకు బాధండుదా?బీసీ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోరా? ఎంపీ వచ్చి లక్ష రూపాయిలు ఇచ్చి కేసు పెట్టొద్దు , ఆయా ఉద్యోగం ఇస్తామని చెబుతారా?
వైసీపీ ఎంపీ, మంత్రుల ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా? మచిలీపట్నంలో డిగ్రీ విద్యార్దికి గంజాయి, డ్రగ్స్ ఇచ్చి వైసీపీ కార్యకర్త అత్యాచారం చేశాడు, ఆడబిడ్డలకు అండగా ఉంటే.. కుల రాజకీయం చేస్తున్నానంటారా? అంటే ఆడబిడ్డలు అన్యాయానికి గురవుతుంటే చూస్తూ ఊరుకోవాలా?
అనగాని సత్య ప్రసాద్ బాధిత కుటుంబానికి అండగా నిలబడకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేదా? పార్టీ తరపున బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్దిక సాయం ఇచ్చాం. గంజాయి మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవటం వల్లే రాష్ట్రంలో ఈ దుస్దితి. గంజాయిని అరికట్టమని మేం చెబితే…టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు, అంటే నేను కూడా రౌడీలకు భయపడాలా?
నన్ను చంపినా పర్వాలేదు, నేను పారిపోను అని నాడే చెప్పాను. రాష్ట్రంలోని మహిళలకు భరోసా ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చా. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఎస్సీ యువతిపై సామూహిక అత్యాచారం చేస్తే..ముఖ్యమంత్రి కనీసం స్పందించడా?
టీడీపీ హయాంలో ముస్లిం మైనార్టీ బాలికలపై అత్యాచారం జరిగితే….కఠినం గా వ్యవహరించాము. మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా నిందితులకి కఠిన శిక్ష వేయాలి. రాష్ట్రం రావణ కాష్ణంలా తయారైంది, ఆడబిడ్డలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఆయా ఉద్యోగం చేసుకుంటావా..చదువుకుని గొప్ప స్దాయిలో ఉండి నీ తమ్ముడిని చంపిన వారి పై పగతీర్చుకుంటావా అని బాధిత బాలిక అడిగితే…గొప్పగా చదువుకుని ఇలాంటి దుర్మార్గులను సమాజం నుంచి తరిమికొడాతానని ఆ బాలిక చెప్పింది. ఎన్టీఆర్ ట్రస్టు తరపున ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటున్నాం, ఇక నుంచి ఆ బిడ్డకు నేను అండగా ఉంటా.
ఖబడ్డార్ …వైసీపీ కార్యకర్తలు… ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత ఒక అన్నగా నేను తీసుకుంటా. జేసీ రెడ్డి అనే వైసీపీ నాయకుడు…ఇది మా ప్రభుత్వం నిందితులకు అండగా ఉంటానని అన్నాడంట. రేపు ప్రభుత్వం మారితే..మీరు ఈ భూమ్మీదే తిరగాలి ఖబడ్డార్ విశాఖలో ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేశారు, అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో పరిస్ధితి చూస్తుంటే పోలీసు వ్యవస్ధకి సిగ్గనిపించటం లేదా?
అనంతపురం జిల్లాలో వైసీపీ నేత ఒకరి ఆస్తి కబ్జా చేస్తే..బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమలాపురంలో మున్సిపల్ చైర్మన్‌పై సాక్ష్యాత్తు మంత్రి ముందే దౌర్జన్యం చేశారంటే రాష్ట్రంలో పరిస్ధితి ఏ విధంగా అర్దమవుతోంది.రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి కూకటి వేళ్లతో సహా పెకలించి బంగాళ ఖాతంలో పడేయాలి.