బీఆరెస్ కు మేలు చేసేందుకే బండి సంజయ్ పై పొన్నం విమర్శలు

-రాజకీయాల్లో సంజయ్ నిప్పు
-కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులు పంపాడు
-సంజయ్ పై అవాకులు, చవాకులు పేలితే . ఖబర్ధార్
-బీజేపి అధికార ప్రతినిధి సంగప్ప ….

బండి సంజయ్ ను విమర్శించే స్థాయి పొన్నం ప్రభాకర్ ప్రభాకర్కు లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. టీఆర్ఎస్ కు మేలు చేసేందుకే , పొన్నం బండి సంజయ్ పై విమర్శలు చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో సంజయ్ నిప్పు అని మచ్చలేని నాయకుడని సంగప్ప అన్నారు. కేసీఆర్ ను ఫామ్ హౌజ్ నుంచి బయటకు లాక్కొచ్చిన ఘనత బండి సంజయ్ దనీ ఆయన చెప్పారు.

కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తాం అని కాంగ్రెస్ కల కంటోందని ఆయన అన్నారు. అందుకే బీజేపీని బద్నాం చేయాలని, కాంగ్రెస్ కంకణం కట్టుకున్నదనీ సంగప్ప చెప్పారు. పొన్నం ప్రభాకర్ సంగతి కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్ కు ఆర్థికంగా కెసిఆర్ సహాయం చేస్తున్నారు బండి సంజయ్ ను విమర్శించెంత స్థాయి పొన్నంకు లేదు. బండి సంజయ్ పాదయాత్ర వల్ల బీఅర్ఎస్ పునాదులు కదిలి నాయని సంగప్ప వివరించారు. బీఆరెస్ ను ఎదుర్కొనే శక్తి కేవలం బండి సంజయ్ నాయకత్వం లోని బిజెపి కి మాత్రమే ఉందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ టికెట్లను కెసిఆర్ ప్రకటిస్తారనీ, ఖర్చులు కూడా ఆయనే చూసుకుంటారని ఆరోపించారు. బీజేపీ అధికారాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయనీ ఆయన దుయ్యబట్టారు.

బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని సంగప్ప జోస్యం చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో మరో అధికార ప్రతినిధి విఠల్ పాల్గొన్నారు.

Leave a Reply