– టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
వైసీపీ పాలనలో క్రీడారంగాన్ని భ్రష్టుపట్టించారు. రాష్ట్రంలో క్రీడలు లేవు, క్రీడాకారులకు ప్రోత్సాహం లేదు. నాలుగేళ్ల తర్వాత సీఎంకు క్రీడా రంగం గుర్తుకు వచ్చిందా? ఇప్పుడు నిద్రలేచి ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తారా? టీడీపీ హయాంలో క్రీడలకు, క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహం అందించాం. 175 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలను నిర్మిస్తే జగన్ నిర్వీర్యం చేశారు. నాలుగేళ్లలో క్రీడా రంగంలో సాధించిన ప్రగతి ఏంటో సీఎం సమాధానం చెప్పాలి?