తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం జోన్ -1 కు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలో చైతన్య రథయాత్ర జరిగింది.
ముందుగా పాయకరావుపేట పట్టణం పాండురంగ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన నాయకులు దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు పాయకరావుపేట పట్టణంలోని అంబేద్కర్, ఎన్.టి.ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఉద్దండపురం వాటర్ ట్యాంక్ వద్ద సెల్ఫీ చాలెంజ్ చేపట్టారు.
నక్కపల్లి, అడ్డరోడ్డు, ధర్మవరం గ్రామాల మీదుగా బస్సుయాత్ర జరిగింది. సాయంత్రం ఎస్.రాయవరంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సెల్ఫీ చాలెంజ్ లో నేతలు పాల్గొన్నారు. అనంతరం జేవీ పాలెంలో మహిళలతో సమావేశమయ్యారు. రాత్రి స్థానికులతో కలిసి భోజనం చేసిన అనంతరం అదే గ్రామంలో పల్లెనిద్ర చేశారు.
ఈ కార్యక్రమంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు, కిమిడి కళా వెంకట్రావు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కావలి ప్రతిభా భారతి, బుద్ధా నాగజగదీష్, బండారు సత్యనారాయణ మూర్తి, పప్పల చలపతిరావు, కొండ్రు మురళీ, గండిబాబ్జి, పీలా గోవింద సత్యనారాయణ కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలిత కుమారి, ప్రగడ నాగేశ్వరరావు, బత్తుల తాతయ్య బాబు, కొరడా రాజబాబు, గవిరెడ్డి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
జోన్ -2
తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం జోన్ -2కు సంబంధించి ఏలూరు పార్లమెంట్ పరిధిలోని దెందులూరు నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర జరిగింది.
వేంపాడు నుంచి కొక్కిరిపాడు, దాసరిగూడెం, కలపర్రు, బాపులపాడు మీదుగా ఏపూరు వరకు యాత్ర నిర్వహించారు.
అనంతరం ఏపూరులోలో జరిగిన సభలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో విధ్వంసం, అరాచకం తప్ప అభివృద్ధి లేదు. నిత్యావసర వస్తువుల ధరలకు అదుపు లేదు. అక్రమార్జనకే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ టిడిపి అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు పాలన స్వర్ణయుగమని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో వెయ్యి కోట్లతో పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు నిస్సహాయులుగా మారారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్ పాలన పట్ల విసిగిపోయారని చెప్పారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో చింతమనేనిపై 72 అక్రమ కేసులు పెట్టి వేధించారని, అయినా మొక్కవోని ధైర్యంతో చింతమనేని పోరాటాలు కొనసాగించారని గుర్తు చేశారు.
టీడీపీ జోన్-2 కోఆర్డినేటర్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ..
నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైంది. ఎమ్మెల్యేలను పిలిచి మళ్ళీ జగన్మోహన రెడ్డిని సిఎం చేయాలని ఇంటింటికీ తిరగాలని ఆదేశించడం సిగ్గుచేటని అన్నారు. ఏం ముఖం పెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలలోకి వెళ్ళి ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ దౌర్జన్య, దోపిడీ పాలన కారణంగా ఎన్నో పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయన్నారు. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవం చేస్తుందన్నారు. ఈనాడు ఛైర్మన్ రామోజీరావు కంపెనీ మార్గదర్శిపై జగన్ ప్రభుత్వ వేధింపులను తప్పుబట్టారు. మార్గదర్శిపై ఖాతాదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, జగ్గంపేట ఇంచార్జ్ జ్యోతుల నెహ్రూ, మాజీ ఎంపీ మాగంటి బాబు, గోపాలపురం ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం ఇంఛార్జి వలవల బాబ్జీ, ఏలూరు ఇంఛార్జి బడేటి రాధాకృష్ణ, పోలవరం ఇంఛార్జి బొరగం శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు కొత్త నాగేంద్రకుమార్, చెన్నుపాటి గాంధీ, కోళ్ళ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, టిడిపి జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, జిల్లా టిడిపి కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, చింతలపూడి ఎఎంసి మాజీ ఛైర్మన్ ముత్తారెడ్డి, పెదపాడు మండల టిడిపి అధ్యక్షులు లావేటి శ్రీనివాసరావు, తెలుగుమహిళ అధ్యక్షురాలు శ్రావణి, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు రెడ్డి చందు, తెలుగురైతు ఏలూరు జిల్లా అధ్యక్షులు గుత్తా ఎరుకులు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి, బిసి ఫెడరేషన్ గౌడ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జోన్-3
తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం జోన్-3 కి సంబంధించి బాపట్ల పార్లమెంట్ పరిధిలోని పర్చూరు నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర జరిగింది.
ముందుగా కారంచేడు వద్ద స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నేతృత్వంలో దాదాపు 500 ట్రాక్టర్ లు, వెయ్యి ద్విచక్ర వాహనాలతో బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్రకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారు. కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా పసుపుమయం అయింది. అనంతరం ప్రారంభానికి నోచుకోని క్రీడాప్రాంగణం, పర్చూరు వాగు బ్రిడ్జి వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేపట్టారు.
పర్చూరులో రెండు కోట్ల రూపాయల నిధులతో టీడీపీ హయాంలో నిర్మించిన క్రీడా ప్రాంగణ వద్ద ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ సెల్ఫీ దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అక్రమ దందాలు, దౌర్జన్యాలతో వైకాపా పాలన సాగుతోంది. దాతల సహకారంతో స్థలాన్ని సమకూర్చి రెండు కోట్ల రూపాయలు నిధులచో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తే ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా ప్రాంగణాన్ని అన్ని హంగులతో తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. అనంతరం బొమ్మల కోడల్లో ఉన్న ఎన్టీఆర్, వంగవీటి రంగా, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ,మాజి ఎంపి శ్రీరామ్ మాల్యాద్రి, మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, చీరాల ఇంచార్జ్ ఎం ఎం కొండయ్య, బాపట్ల ఇంచార్జ్ నరేంద్ర వర్మ, గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ మహమ్మద్ నజీర్, డేగల ప్రభాకర్, మానుకొండ శివప్రసాద్, సలగల రాజశేఖర్ బాబు, రవిపాటి సాయి కృష్ణ, పర్చూరు మండల అధ్యక్షుడు శంషుద్దీన్, ఇంకోలాధ్యక్షుడు హనుమంతరావు, కారంచేడు అధ్యక్షుడు శ్రీహరి, యద్దనపూడి మండల అధ్యక్షుడు రంగయ్య, చీర చినగంజ మండల అధ్యక్షుడు పొద వ్రీరయ్య, మాటూరు మండల అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జోన్ -4
తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ కు కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం జోన్ -4కు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండేపి నియోజకవర్గంలో చైతన్య రథయాత్ర జరిగింది.
ఈతముక్కల రోడ్డులో నేతలు సెల్ఫీ ఛాలెంజ లు విసిరారు. వల్లూరుమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీ.నాయుడుపాలెంలో అంబేద్కర్, ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి నివాళులు అర్పించారు. కలికివాయి గ్రామంలో చైతన్న రథయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నందనవనంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో నేతలు పాల్గన్నారు.
ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, ఎమ్మెల్సీ బి.ఎన్. రాజసింహులు, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే డా.డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డా.నూకసాని బాలాజీ, డా.ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, గూడూరి ఏరిక్షన్ బాబు, డాక్టర్ హెలెన్ హేమలత, దామచర్ల సత్య, నారాయణ, శ్రీరామ్ చిన్నబాబు, నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.