ప్రగతి పై ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోది సిఎస్ లతో వీడియో సమావేశం
అమరావతి,28 జూన్:దేశ వ్యాప్తంగా పలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి అమలు చేస్తున్న వివిధ జాతీయ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రగతిపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోది వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ వీడియో సమావేశంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్, ఢిల్లీ-వదోదర-ముంబయ్ ఎక్స్ప్రెస్ వే,చోటాదపూర్-ధార్ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్, రత్లాం-మాహౌ-ఖాండ్వా-అకోలా
రైల్వే లైన్ కన్వర్షన్, ముంబాయి-నాగపూర్-ఝూర్సుగుడ పైపులైన్,బైలదిల్లా ఐరన్ ఓర్ డిపాజిట్,పియం స్వానిధి పధకం అంశాలకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశంలో సమీక్షించారు.
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి,ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్,జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్,ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు,టిఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న,ఐటి శాఖ కార్యదర్శి కె.శశిధర్,పిసిసిఎఫ్ ఎకె.ఝా తదితర అధికారులు పాల్గొన్నారు.