Suryaa.co.in

Andhra Pradesh

దళితులను బతకనివ్వవా జగన్ సార్? దళితులంటే ఎందుకంత చులకన?

నంద్యాల పోలీసుల వేదింపులకు సన్నబోయిన చిన్నా అనే 23 ఏళ్ల దళిత యువకుడు బలై వారం తిరగకముందే మరో దళిత యువకుడు బేతమాల మణిరత్నం అలియాస్ మంచోడు మణి ని విచారణ పేరుతో వేదిస్తున్న సీఐడీ పోలీసులు. నా ప్రాణానికి సీఐడీ పోలీసుల నుండి ప్రాణహాని ఉంది అని వీడియో విడుదల చేసిన మణిరత్నం.

మంచోడు మణి అనే పేరుతో సామాజిక మాధ్యమాల్లో నిత్యం వైసీపీ దురాగతాలను ప్రశ్నించే మణిరత్నంను టార్గెట్ చేసిన వైసీపీ సీఐడీ పోలీసులను పావులుగా వాడుకుని మణిరత్నం నోరు ముగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మణిరత్నం పై అక్రమకేసులు బనాయించి ఇప్పటికే పలుమార్లు విచారణ పేరుతో వేదించడం జరిగింది.

అయినప్పటికీ వెనక్కు తగ్గని మణిరత్నం ను ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశం తో ఈరోజు మరోసారి సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నోటీసులో స్పష్టంగా ఆంద్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు రావల్సిందిగా ఉండడం తో మణిరత్నం ఉదయం మంగళగిరి లోని డీజీపీ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ నుండి విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి వెళ్ళవలసిందిగా తెలుపడంతో అక్కడకు వెళ్లిన మణిరత్నం ఒక వీడియో ద్వారా తనను సీఐడీ పోలీసులు ఉదయం నుండి తిప్పుతూ చివరకు విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లడాన్ని తెలిపి తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే పోలీసులే బాధ్యత అని తెలిపారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రోజురోజుకీ దళితులపై జరుగుతున్న దాడులు చూస్తుంటే దళితుల అంతానికి జగన్ రెడ్డి పంతం పట్టినట్లుగా స్పష్టమవుతుంది.

LEAVE A RESPONSE