– అతని జీవితంపై త్వరలో సినిమా తీస్తాం..
– మహిళా లోకం మెచ్చుకునేలా క్లైమాక్స్ లో అతనికి గుణపాఠం
– ఈ సినిమాకు మరికొన్ని టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నాం
“- నిత్య పెళ్ళి కొడుకు..
– పెళ్ళిళ్ళు-పెటాకులు
– తాళి-ఎగతాళి
– మూడు ముళ్ళు-ఆరు పెళ్ళిళ్ళు
– బహుభార్యా ప్రావీణ్యుడు
– అయిన పెళ్ళిళ్ళెన్నో.. పోయిన చెప్పులెన్నో..” టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నాం.
– బ్రో అట్టర్ ఫ్లాప్ మూవీ.. డిజాస్టర్.. పవన్ సినిమాలు ఇక ఆడవు
– నాపై కాంట్రవర్సీ చేసి.. కలెక్షన్లు పెంచుకోవాలని చూస్తున్నారు
– ఇప్పటివరకు ఆ సినిమాకు రూ. 55.26 కోట్లు షేర్ వచ్చింది
– పవన్ కు రెమ్యునరేషనే రూ. 50 కోట్లకు పైగా ఇవ్వాలి
– తీసుకున్న రెమ్యునరేషన్ కు పవన్ ఇన్‌కం టాక్స్‌కి లెక్కలు చెప్పాడా..?
* ప్రొడ్యూసర్ డబ్బులతో రాజకీయ కక్ష సాధింపులకు సినిమాని వాడుకున్నాడు*
– మరోవైపు టీడీపీ ప్రొడ్యూసర్ ను అడ్డం పెట్టి బాబు నుంచి ప్యాకేజీ తీసుకుంటున్న పవన్
– మంత్రి అంబటి రాంబాబు
కలెక్షన్లు తగ్గుతున్నాయనే కాంట్రవర్సీ:
– వినోదయా సీతం అనే తమిళ ఓటీటీ చిత్రాన్ని తీసుకుని తెలుగులో బ్రో పేరుతో భారీ బడ్జెట్‌తో ఒక చిత్రాన్ని నిర్మించారు.
– దీనిలో పవన్ కళ్యాణ్, సాయి ధర్మతేజ్ నటించగా సముద్రఖని దర్శకత్వం చేశారు.
– ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాశారు. విశ్వ ప్రసాద్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు.
– సినిమాల గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితిని ఆ సినిమా తీసిన వాళ్లు కల్పించారు.
– ఈ సినిమాలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి…ఆ పాత్రను పవన్ కళ్యాణ్ దూషించి,కించపరిచేలా సృష్టించారని నేను భావిస్తున్నాను.
– అంతటితో ఆగకుండా దానిలో నటించిన నటులు మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నారు.
– కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి, దానిని కాంట్రవర్సీ చేయడం ద్వారా కలెక్షన్లు పెంచుకోడానికి ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది.
– పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతంగా ఉందని, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. సక్సెస్ మీట్లు కూడా పెడుతున్నారు కానీ, వాస్తవంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అదొక డిజాస్టర్ మూవీ.
– దాని కలెక్షన్లు చూస్తే నిన్నటి వరకు రూ. 55.26 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
– నిన్న అయితే 2.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
– ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడానికి రెండు కారణాలున్నాయి.
– ఒకటి సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో నిర్మాత డబ్బులు పెడితే.. దానిలో తన శతృవుల పేర్లు పెట్టి దూషించి పైశాచిక ఆనందం పొందాలనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. అటువంటిది కమర్షియల్‌గా హిట్ కాదు…ప్రజలకు చేరదు.
– త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో నన్ను ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం చేశారు.
– ఈ సినిమాకు మొత్తం కలెక్షన్లు రూ.60 నుంచి రూ.70 కోట్లు వస్తాయనుకుంటుంటే హీరో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ రూ.50 కోట్లు పైనే ఉంది.
– చివరికి పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కూడా వచ్చే పరిస్థితులు లేకుండా ఈ చిత్రం ఆడుతోంది.
– కారణం సినిమా దృష్టి సరిగాలేకపోవడం..శతృవులను ఇందులో ఇమిడ్చి శునకానందం పొందాలనుకోవడమే.
పవన్ కు అమ్మవారి శాపం:
– పవన్ కల్యాణ్ చిత్రాలు ఇక ఆడవు. ఒక సారి వెనక్కి వెళ్లి చూసుకోండి.
– వారాహి అనే ఒక పవిత్రమైన అమ్మవారిని తన కాళ్ల కింద పెట్టుకుని వాహనంగా నామకరణం చేశాడో, దానిపై నుంచి అవాకులు చెవాకులు, బూతులు మాట్లాడే ప్రయత్నం చేశాడో ఆనాడే అమ్మవారి శాపం తగిలింది.
– రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు..మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.
– ఇక ఆయన సినిమాలు కూడా ఆడవు అని నిర్మాతలు తెలుసుకుంటే మంచిది.
– నిర్మాత విశ్వప్రసాద్ పెట్టుబడి పెట్టేటప్పుడు ఇది పొలిటికల్ మూవీనా అనేది చూసుకోవాలి.
– పొలిటికల్ మూవీలు కూడా అనేకం వచ్చాయి.
– కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కక్ష తీర్చుకోవాలని తాపత్రయ పడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది.
– సినిమా ఫ్లాఫ్ కాలేదు..సక్సెస్ అయిందంటే కలెక్షన్లు ఎంతో లెక్కలు చెప్పండి.
– టీజీ విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయి…
– టీడీపీకి చెందిన చంద్రబాబు అండ్ ముఠా అమెరికాలో డబ్బులు కలెక్ట్ చేసి, ఆ డబ్బును విశ్వప్రసాద్‌కి ఇస్తే… బాబు ఇచ్చే ప్యాకేజీని జమ చేయడం కోసం పవన్ కళ్యాణ్‌కి ఈ విధంగా ఇస్తున్నారు.
– చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందించే కార్యక్రమం చేశారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.
– పవన్ కల్యాణ్… రూ.66 కోట్లు తీసుకున్నారా..? లేక రూ.80 కోట్లు తీసుకున్నారా..?
– మీరు తీసుకున్న పూర్తి నగదును ఇన్‌కం టాక్స్ వారికి చూపించారా.. లేదా..?
– నీతి, నిజాయితీపరుడునని, చట్ట ప్రకారం నడుచుకునే సైనికుడు అని పదే పదే చెప్పే పవన్ కల్యాణ్ దీనిలో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు..? అనేది చెప్పాలి.
– దీనికి ఎంత కలెక్షన్లు వచ్చాయి..ఈ చిత్రం ఫ్లాఫ్ కావడానికి కారణాలేమిటి అని చిత్రసీమలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం.
– రోజుకు రెండు కోట్లు రూపాయలు తీసుకున్నాడు. 40 రోజులు చేశాడని ఒకరు.. 23 రోజులు చేశాడని మరొకరు అన్నారు.
– 40 రోజులైతే రూ.80 కోట్లు తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
– విశ్వప్రసాద్ బ్లాక్ మనీని వైట్‌గా చేసి సినిమా ద్వారా పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. ఇది ఒక స్కామ్.
– రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయోచ్చు కానీ…సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే రెండూ నాశనం అవుతాయి.
– ఎన్టీఆర్ వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఒకటీ రెండు సినిమాలు తీశాడేమో కానీ సినిమాలను అయితే వదిలేశాడు.
– చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నాళ్లు సినిమాలు తీయలేదు.
– ఈయనకు సినిమాలు కావాలి..రాజకీయాలు కావాలని… రెండింటికీ న్యాయం చేయలేని ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాడనేది స్పష్టంగా అర్ధం అవుతుంది.
క్లైమాక్స్‌లో మహిళా లోకం మెచ్చుకునేలా గుణపాఠం:
– మేం కూడా ఒక సినిమా తీయాలి అనుకుంటున్నాం. ఆ కథా వస్తువేమిటో ఈ సందర్భంగా వివరిస్తున్నాను.
– ఒక మంచి కుటుంబ నేపథ్యం..
– ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీలు అవుతారు.
– ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి యుక్త వయసు వచ్చి..చదువు సరిగ్గా అబ్బక…బజార్ల వెంట చిల్లరగా తిరిగితూ ఏం చేయాలో అర్ధం కాకపోతే అన్నయ్యల వద్ద పెట్టారు.
– నేను అన్నయ్యల వద్ద ఉండను.. అన్నల్లో కలిసిపోతాను..రౌడీయిజం చేస్తాను…అంటూ మరోవైపు అక్కడా ఇక్కడా గోకుతాను అనేవాడు.
– ఇక లాభం లేదని తన అన్నలు తమ సినిమా రంగంలోకే అతన్ని తీసుకొస్తారు.
– అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి అన్నయ్యల కంటే పెద్ద సెలబ్రిటీగా అతను మారిపోతాడు.
– ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్పడం.. దానికి అమాయక జనం ఈలలు వేస్తుంటారు.
– దేశం, సమాజం, మానవత్వం, సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు.
– ఇది బయటకు కనిపించే కథ.
– మేడిపండు చందంగా అతని నిత్య జీవితంలోకి వస్తే అతనికి పెళ్లి చేస్తారు.
– ఆ పెళ్లి పట్టుమని రెండు ఏళ్లు కూడా ఉండదు..
– మళ్ళీ మరో పెళ్ళి.. పిల్లల్ని కంటాడు.. భార్యతో విభేదిస్తాడు.
– సంసారం చేస్తూనే మరో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు.
– ఆ స్త్రీ నన్ను పెళ్లిచేసుకుంటావా లేదా అంటే మొదటి భార్యతో సెటిల్ చేసుకుని రెండో భార్యను పెళ్లిచేసుకుంటాడు.
– ఇంతటితో ఆగదు..రెండో భార్యకూ అదే జరుగుతుంది. రెండో భార్యకు ఏం జరిగిందో మూడో భార్యకూ అదే జరుగుతుంది.
– మూడో భార్యకు ఏం జరుగుతుందో.. నాలుగో భార్యకూ అదే జరుగుతుంది.
– బయటకు మాత్రం అద్భుతమైన మేకప్‌తో సంఘసంస్కర్తలా ఫోజులు పెడుతుంటాడు.
– క్లైమాక్స్ మాత్రం అందరు పిల్లలు, అందరు భార్యలు కలిసి మహిళా లోకం మెచ్చుకునే తగిన గుణపాఠం నేర్పుతారు.
– ఈ కథపై సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నాం.
– ఒకరు నిత్య పెళ్లి కొడుకు అని సూచించారు..మరొకరు పెళ్లిళ్లు–పెటాకులు సూచించారు.
– తాళి–ఎగతాళి అనేది కూడా పరిశీలనలో ఉంది. మూడు ముళ్లు…ఆరు పెళ్లిళ్లు కూడా పరిశీలిస్తున్నాం.
– బ్రో లా మ్రో… మ్యారేజెస్- రిలేషన్స్-అఫెండర్…
– ఆఖరుగా అయిన పెళ్లిళ్లు ఎన్నో…పోయిన చెప్పులెన్నో…అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నాం.
– పేర్లు, కథలో మార్పులు ఏమైనా ఉన్నా, సలహాలు సూచనలు ఎవరైనా చేయవచ్చు.. ఎందుకంటే.. బ్రోలా అట్టర్ ప్లాప్ అయితే కష్టం.
శ్యాంబాబు ఎందుకు…నేరుగా రాంబాబు అనే పెట్టుకో:
– కథ సారాంశం ఏంటంటే సినిమాల్లో ఎవరిని పడితే వారిని గోకితే సినిమాలు సక్సెస్ కావని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి.
– దమ్ముంటే పూర్తి పొలిటికల్ సినిమాలు తీసుకోవచ్చు..శ్యాంబాబు ఎందుకు..రాంబాబే అని నేరుగా పెట్టుకోవచ్చు.
– నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు. నేనేమన్నా డాన్స్ మాస్టర్నా.. మా అన్నయ్య డాన్స్‌లో ప్రావీణ్యుడా..?
– ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి..అనవసరంగా ఎవరిని పడితే వారిని కెలకడం సమంజసం కాదని తెలుగు చలనచిత్రసీమలో ఉన్న నిర్మాతలు, నటులు, దర్శకులు, త్రివిక్రమ్‌లాంటి రచయితలకు చెప్తున్నా.
– ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం, మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
– కొత్త సినిమాలో నాకు ఏ పాత్ర ఉండదు. నా డ్యాన్స్ కూడా ఉండదు.
– మహిళలందరూ మెచ్చుకునేలా క్లైమాక్స్ ఉంటుంది. అది చూడటానికే తండోపతండాలుగా ప్రజలు వస్తారు.
– మాది లో బడ్జెట్ సినిమా… మా సినిమాలో హీరో రూ.60 కోట్లు తీసుకోడు.
– రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా సినిమాలు తీసుకోవచ్చు.
– ఎవరు తీసినా.. పూర్తి పొలిటికల్ సెటైర్ తీసుకోవచ్చు.
– లేదంటే నా పేరు పెట్టుకునే సినిమా తీసుకో…ఎవరు వద్దంటారు. ఎక్కడో ఒక బిట్లో పెట్టుకుని నిర్మాతను మోసం చేయడం తప్పు.
– నా పేరు పెట్టుకున్నందుకు నేను డబ్బులు కూడా అడగను.. సంబరాల రాంబాబు అని పెట్టుకోమను.
– అనవసరంగా చాటుచాటున గోకవద్దు… డైరెక్టుగా గోకు..చూసుకుందాం.
– దమ్ముంటే, ధైర్యం ఉంటే తడాకా ఏంటో చూసుకుందాం.
– చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌కి ప్యాకేజీ సినిమా రూపంలో ఇచ్చాడని అంతర్జాతీయ నిఘా సంస్థల్లోని ముఖ్యమైన వ్యక్తులు నాతో మాట్లాడారు.
– నన్ను పిలిచి చెప్పారు…ప్రజలకు తెలియజేయండి అని నాతో పర్సనల్ గా చెప్పారు. అవసరమైన సమయంలో వారెవరో చెప్తా.
– ఒక క్యారెక్టర్‌ను పెట్టి ఆయన్ను కాదండి అంటూ నాటకాలు వద్దు.
– 50- 50 నాటకాలు అడొద్దు.. డైరెక్టుగా గోకండి. డైరెక్టుగా సెటైర్ కొట్టండి చూద్దాం.
– శ్యాంబాబు, రాంబాబు అంటూ నా డ్రస్ వేసి ఇలాంటి డ్రామాలు వేయవద్దు.
– మేము తీయబోయే సినిమాకు సూటబుల్ టైటిల్ పెడితే వెయ్యి నూటపదహార్లు కూడా బహుమతిగా ఇస్తాం.