-చంద్రబాబువి దింపుడు కల్లం ఆశలు
-ఎంపీ విజయసాయిరెడ్డి
నాలుగేళ్లుగా జాతీయ మీడియా సంస్థలు పలు దఫాలుగా నిర్వహించిన సర్వేల్లో వైస్సార్సీపీకి 51% మించి ప్రజాదరణ ఉందని స్పష్టం చేశాయని రాజ్యసభ సభ్యులు,వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు..పలు అంశాలపై సోషల్ మీడియాలో శుక్రవారం ఒక ప్రకటన చేశారు.
ప్రజాధరణలో ప్రతిపక్ష పార్టీలన్నిటినీ కలిపినా 40% దాటలేదని చెప్పారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తేదేపాకు గుణపాఠం అని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా దింపుడు కల్లం ఆశలతో చంద్రబాబునాయుడు ప్రజలకు ఏవేవో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
2024 ఎన్నికల్లోనూ 2019కి మించి ఎక్కువ సీట్లు గెలిచి వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని అన్నారు…చంద్రబాబు ఎన్ని పార్టీలతో పోత్తు పెట్టుకున్నా వైయస్సార్ సిపి ఒంటరిగానే పోటి చేసి గత ఎన్నికల్లో గెల్చుకున్న సీట్లకంటే ఎక్కువ గెలిచి టిడిపికి గుణపాఠం చెబుతామన్నారు.
చంద్రబాబు విజన్ 2047 పేరుతో (సొంత) భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించుకొన్నారని చెప్పారు.. తానిచ్చే తాయెత్తును 45 రోజులపాటు పూజ గదిలో ఉంచి, ఏ ఆపద వచ్చినా తనను తల్చుకోవాలని చెప్పడం వింతగా లేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. ప్రజలు తెలివిలేని వారని భావిస్తున్నారా…లేక మానసిక సమస్యలవల్ల ఇలాంటి పరస్పర విరుద్ధ ఆలోచనలు వస్తున్నాయా అని చంద్రబాబుని ప్రశ్నించారు .
జన్ ఔషధి కేంద్రాలను 10,000 నుండి 25,000 కు పెంచడం ద్వారా దిగువ మరియు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వారికి సరసమైన ధరలకే మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దేశంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా కేంద్రాసుపత్రి వరకు జన్ ఔషధి కేంద్రం ఉండాలలని ఆయన అన్నారు..