చంద్రబాబు ఇసుక ప్రజెంటేషన్ కు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం మంత్రిగా మీకు తగునా?
– జూనియర్ ఇసుకాసురుని(పెద్దిరెడ్డి) జీవితమంతా దోపిడీలు.. అబద్ధాలే
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులునక్కా ఆనంద్ బాబు
– మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు బహిరంగ లేఖ
తేదీః27-08-2023
బహిరంగ లేఖ
ఈ క్రింది ప్రశ్నలపై ప్రజలకు సమాధానం చెప్పాలి
1. టీడీపీ పాలనలో చంద్రబాబు ఇంటి పక్కన ఇసుక దోపిడీ జరిగిందన్న మీ ఆరోపణ పచ్చి అబద్ధం కాదా? చంద్రబాబు ఇంటిపక్కన అమరావతి నిర్మాణాలకు నీటిపారుదల శాఖ చేసిన డ్రెడ్జింగ్ లో వచ్చిన ఇసుకను వాడుకుంటే ప్రతిపక్షంలో ఉన్న మీరు వక్రీకరించి అబద్ధపు ప్రచారం చేశారు. మీరు అధికారానికి వచ్చిన తరువాత నిబంధనల ప్రకారమే డ్రెడ్జింగ్ చేశారని ఎన్.జి.టి.లో జగన్ రెడ్డి ప్రభుత్వం అఫిడవిట్ వేసి జరిమానా రద్దుచేసుకున్నది నిజం కాదా? ఎన్.జి.టి.లో మీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ కు విరుద్ధంగా ఇప్పుడు మళ్లీ పాత అబద్ధమే చెప్పడం మోసం కాదా?
2. పశ్చిమగోదావరి జిల్లా ఇసుక రీచ్ లను నిర్వహిస్తున్న మహిళా సంఘాలపైకి కృష్ణా జిల్లా తహశీల్దారు వనజాక్షి వెళ్లి దౌర్జన్యం చేయడం అధికార దుర్వినియోగం కాదా? మహిళా సంఘాలకు, వనజాక్షికి మధ్య జరిగిన గొడవను చింతమనేని పైకి నెట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం నీచ రాజకీయం కాదా?
3. టీడీపీ పాలనలో రూ.1000లకు వచ్చే ట్రాక్టర్ ఇసుక నేడు రూ.5,000లకు పెరగడం మీ దోపిడీపాపం కాదా?
4. వైకుంఠపురం రీచ్ లో అనుమతికి మించి రెట్టింపు పైగా ఇసుక తవ్వారని కోర్టు కమిషన్ నిర్ధారించింది వాస్తవం కాదా? అనుమతుల మేరకే ఇసుక తవ్వకాలు చేశామనే మీ ప్రకటన పచ్చి అబద్ధం కాదా?
5. అనధికారికంగా 500 రీచ్ లలో 40 కోట్ల టన్నుల ఇసుక తవ్వి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలకు అక్రమంగా తరలించి రూ.40వేల కోట్ల దోపిడీ చేసింది జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ కాదా?
6. ఇసుక తవ్వకాలపై ప్రస్తుతం కోర్టులు నిషేధం విధించి ఉన్నా.. ధిక్కరించి ఇసుక తవ్వి కొండలు.. కొండలు నిల్వ చేసి అక్రమ బిల్లులతో అమ్మకొంటున్నది వాస్తవం కాదా?
7. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గుండుమేడకు ఈసీ లేకున్నా అక్కడ లక్షలాది టన్నుల ఇసుక కొండను నిల్వచేయడం నిబంధనల ఉల్లంఘన కాదా?
8. పుంగనూరు నియోజకవర్గం వలిగట్ల నుంచి, తంబళ్లపల్లె నియోజకవర్గం పిటిఎం నుంచి మీరు బెంగుళూరుకు ఇసుక తరలిస్తున్నది వాస్తవం కాదా? అలాగే తిరుపతి జిల్లా నుంచి స్వర్ణముఖి, అరణియార్, నీవా నదుల నుంచి చెన్నైకి అక్రమంగా ఇసుక తరలించి వందల కోట్లు సొమ్ము చేసుకుంటున్నది వాస్తవం కాదా?
9. టీడీపీ ఉచిత ఇసుక విధానం రద్దు చేయడం వల్ల మహిళా సంఘాలు, పంచాయతీలు నష్టపోయింది వాస్తవం కాదా? 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి అందులో 130 మంది కార్మికులు చనిపోయింది నిజం కాదా? ఇసుక ధరలు నాలుగురెట్లు పెంచడం వల్ల 125 వృత్తుల వ్యాపారాలు దెబ్బతిన్నది నిజం కాదా?
10. మీ ఇసుక మాఫియాకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 48 మంది ప్రాణాలు బలితీసుకున్నది వాస్తవం కాదా? ఇసుక మాఫియాను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు రాజమహేంద్రవరంలో పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించింది నిజం కాదా? ఈ దారుణంపై రాష్ట్రపతి స్పందించినా మీరు, మీ సీఎం ఎందుకు స్పందించలేదు? రూ.40వేల కోట్ల దోపిడీ కారణం కాదా?