– విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా ఎంత విద్యుత్ ఉత్పత్తిచేశారో చెప్పగలరా?
– విండ్ ఎనర్జీ టవర్స్, డ్రిప్ ఇరిగేషన్, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులపై జగన్ రెడ్డిని నిలదీసిన చంద్రబాబు
– ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో జగన్ కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన విండ్ ఎనర్జీ టవర్స్, డ్రిప్ ఇరిగేషన్, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులపై జగన్ రెడ్డిని నిలదీసిన చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…:
“ రాయలసీమలో తక్కువగా లభించే నీటివనరుల్ని సద్వినియోగం చేసుకోవా లంటే బిందు, తుంపర్ల సేద్యమే మంచి విధానం. టీడీపీ హయాంలో ఇక్కడే 50 వేల ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్యం ప్రారంభించాం. సంపద సృష్టి అంటే ఉన్న వనరులు, ఆస్తుల్ని ఉపయోగించుకొని, కొత్త అవకాశాలు సృష్టించడం.
వర్షాల ఆధారంగా వేసిన వేరుశనగ ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. భూమి ఒకటే ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడమే కీలకం. ఆనాడు మేమిచ్చి న డ్రిప్ ఇరిగేషన్ ను ఎందుకు ఈ ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది.
కేంద్రప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపో యారు? ఇక్కడే పక్కన హంద్రీనీవా కాలువ పోతోంది. దాన్ని ఇంకా వెడల్పు చేసి ఏదో చేస్తామన్నారు… కానీ ఇక్కడేమీ జరగలేదు. ఆఖరికి నీళ్లే ఇవ్వలేని స్థితికి వచ్చారు. హంద్రీనీవా కాలువ పనులు ఎంతవరకు చేసి ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో జగన్ రెడ్డి చెప్పగలరా?
ఇక్కడున్న విండ్ ఎనర్జీ టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిందే. విండ్ పవర్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి భూముల ధరలు పెరిగాయి. గ్రీన్ ఎనర్జీ లో భాగంగా కాలుష్యం లేకుండా నాణ్యమైన కరెంట్ లభించింది. ఈ ప్రభుత్వంలో విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో భాగంగా ఎంత విద్యుత్ ఉత్పత్తిచేశారో చెప్పగలరా?
ఇక్కడ ఒక్కచోటే ఈప్రభుత్వ విధానాలకు బలైన మూడు ప్రాజెక్టులు చూశాం. ఒకటి డ్రిప్ ఇరిగేషన్.. రెండు హంద్రీనీవా.. మూడు విండ్ ఎనర్జీ. ఈ జిల్లాకు నీళ్లు ఇస్తే కష్టపడే ఇక్కడి రైతులు భూమి నుంచి బంగారం పండిస్తారు. ముందుచూపు తో చేసిన వాటన్నింటినీ నాశనంచేసిన వీళ్లు బీదరికం పెంచే పరిస్థితికి వచ్చారు. టీడీపీ పాలనకు, వైసీపీకి ఎంత తేడా ఉందో… ఇక్కడి పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది.”