ఎంపీ విజయసాయిరెడ్డి
సెప్టెంబరు,13: బీజేపీ ఏ.పి అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షుడిగా కొనసాగితే పురంధేశ్వరిలా అవినీతిపరులకు మద్ధతు పలికేవారు కాదని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు.. టీడీపీ బలహీనతను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారని అభిప్రాయపడ్డారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కర్ణాటక డిప్యూటి సిఎం డీకే శివకుమార్ ద్వారా‘ఇండియా’ కూటమికి దగ్గరవుతున్న విషయం బిజెపి అధిష్ఠానానికి తెలుసని ఆయన చెప్పారు.. స్కిల్ స్కాంలో చంద్రబాబు చేసిన ప్రజాధనం లూటీని ఆధారాలతో సిఐడి నిగ్గు తేల్చిందని అన్నారు..ఆయన జీవితం అంతా నేర,కుట్రపూరిత రాజకీయమేనని మండిపడ్డారు.. బాబుపై ఉన్న కేసులన్నిటిలో శిక్షపడితే జీవితాంతం జైల్లోనే గడపాలన్నారు..
నిఫా వైరస్ విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉండాలి
కేరళలో నిఫా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలను సీరియస్‌గా తీసుకుని ఈ మరణాలపై విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలని ఆయన చూచించారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌తో ఇన్ఫెక్షన్ కేసులు లేవని నిర్ధారించుకోవాలని అన్నారు. దీన్ని నివారించే మార్గాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, నిఫా వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుందని చెప్పారు..