తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట నేషనల్ హైవే మీద గుంటూరు జిల్లా దివ్యాంగులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ…
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలు చేపడుతున్నారని అన్నారు.. ప్రజాస్వామ్య దేశంలో అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు..
నాడు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేసి అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే, నేడు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అబద్దపు నేరారోపణలు చేసి అక్రమ కేసులు బనాయించారని అన్నారు..
రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ జగన్‌రెడ్డి నియంత పాలనను అవగాహన చేసుకోవాలని, సీఎం జగన్‌కు ఉన్న అవినీతి మరకలు చంద్రబాబుకు అంటించాలనే.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును వేధిస్తున్నారని ధ్వజమెత్తారు…
చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి అందుకు నిరసనగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు, బాబు అభిమానులు పలు ప్రాంతాల్లో రోడ్లెక్కారని, చంద్రబాబు స్థాపించిన హై టెక్ సిటీ, అలాగే ఇతర ఐటీ కంపెనీల ద్వారా ఉపాధి పొందిన వేలాధి మంది ఐటీ ఉద్యోగులు నానక్‌రామ్‌గూడ ఐటీ జోన్‌లోని విప్రో సర్కిల్‌కు చేరుకుని నిరసన తెలపడం చూస్తుంటే ఆయన చరీష్మా ఏంటో అర్ధం చేసుకోవాలని…
దేశ విదేశాల్లో మన ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే అది ఆయన విజన్ వల్లే అని, తెలుగు రాష్ట్రాల్లో పేదరికం పోయి కుటుంబాలు ఆనందంగా బతకడానికి చంద్రబాబు ప్రధాన కారకుడని అన్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబునాయుడుకి భద్రత లేదు ఆయనకి ఏమైనా జరిగితే జుడీషియల్ బాధ్యత వహించాలని గోనుగుంట్ల తెలిపారు.
ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పూదోట సునీల్, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుముల దుర్గారావు, జోజి బాబు, దర్శి వెంకట్రావు, కోకా బాలాజీ, నంబూరి శీను, శివ, గంగయ్య, గోగన ఆదిశేషు, గొట్టిపాటి లక్ష్మణ్, నాగరాజు, బాలరాజు, పసుపులేటి సైదారావ్, వెలుగు శివప్రసాద్, గొలుసులు సాయి, పొన్నబోయిన నాగేశ్వరరావు, యడ్లపల్లి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.