– బెంగుళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాహసం
– గణపతి సాహసానికి అచ్చెరువొందిన భువనేశ్వరి
– మీలాంటి అభిమానుల అభిమానమే కొండంత అండ అని సంబరం
చంద్రబాబుకు సంఘీభావంగా ఓ యువకుడు కుప్పం నుండి సైకిల్ పై బయలు దేరి రాజమండ్రికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, కనమపచ్చర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈ నెల 12న సైకిల్ పై బయలుదేరి మంగళవారం రాజమండ్రికి చేరుకున్నాడు.
బెంగళూరులోని సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో క్వాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్న గణపతి చంద్రబాబుకు వీరాభిమాని. ఈ నెల 9న చంద్రబాబు అరెస్టు అయ్యి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారన్న విషయం తెలుసుకున్న గణపతి సంఘీభావం తెలిపేందుకు 724 కి.మీ మేర సైకిల్ తొక్కి రాజమండ్రికి చేరుకన్నాడు. చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రిలోనే బస చేస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను కలిశాడు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇంతటి అభిమానులు ఉండటం మనోధైర్యం ఇస్తోందని, మీ అభిమానం, అండదండలతోనే చంద్రబాబు బయటకు వస్తారని తెలిపారు. కుప్పం ప్రజలు తమపై చూపిస్తున్న ఆప్యాయతను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.