-చేస్తే ఆ విషయం ప్రజలకు చెప్పాలి
– టిడిపి బలహీనపడిందని పవన్ కల్యాణ్ చెప్పారు.జవసత్వాలు ఉడిగిపోయిందని కూడా ప్రకటించారు
– పవన్ మాటలను టిడిపి నేతలు ఒప్పుకోవాలి
– టిడిపి,జనసేన ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తాయో తెలియాల్సి ఉంది
– పవన్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని అన్నారు.దీనిపై బిజేపి స్పందించాలి
-స్కిల్ స్కామ్ లో చంద్రబాబు లాయర్లు 17 ఏ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు
– స్కాం జరిగిందని గుర్తించారు కాబట్టే చంద్రబాబు లాయర్లు మాట్లాడలేకపోతున్నారు
– ఈ స్కాం లో పారిపోయిన వ్యక్తులను చంద్రబాబు త్వరగా పలిపించి సిఐడికి అప్పగిస్తే మంచిది
– చంద్రబాబును జైలులో పెట్టింది కోర్టు.. వైయస్ జగన్ కాదు అనే విషయం గమనించాలి
– ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైయస్ జగన్ కు లేదు
– వైయస్ జగన్ గురించి లోకేష్ పనిపాటాలేకుండా విమర్శలు చేస్తున్నారు
– చిన్నపిల్లలతో భువనేశ్వరి ఎదుట కారుకూతలు కూయిస్తున్నారు
– పిల్లలతో కారుకూతలు కూయిస్తున్నవారు లాయర్లను,జడ్జిలను వదులుతారా?
– ఎల్లోమీడియా పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లినట్లుంది
-కేంద్ర,రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలనే వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు..దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి
– వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ పై టిడిపి ఎప్పుడూ తప్పుడు ప్రచారమే చేస్తోంది
– మీడియాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని, ఆ పార్టీకి జవసత్వాలు ఉడిగిపోయాయని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. టిడిపి బలహీనపడిందనే విషయాన్ని ఆ పార్టీ నేతలు ఒప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీని జనసేన టేకోవర్ చేసినట్లయితే ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మాట్లాడారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
టిడిపి బలహీన పడిందనే పవన్ కల్యాణ్ పెడన సభలో చెప్పిన మాటలను ఎల్లోమీడియా ఎక్కడా హైలెట్ చేయడం కాని…ప్రచురించడం కాని చేయకుండా జాగ్రత్త పడ్డాయని ఎద్దేవా చేశారు. కేవలం తెలుగుదేశం, జనసేన పొత్తుతో వైయస్ జగన్ ను గద్దెదించుతామని ప్రకటించినట్లు ఎల్లోమీడియాలో చూశాం అన్నారు. కాని పవన్ కల్యాణ్ ఏమన్నాడనేది మీడియా కూడా గమనించే ఉంటారని అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ అన్నమాటలను మీకు చూపుతున్నానంటూ సభలో పవన్ మాటలను వీడియో ద్వారా ప్రదర్శించారు.
తనకు పలు కష్టాలున్నప్పటికి ఎన్ డి ఏ నుంచి తాను బయటకు వచ్చానని పవన్ కల్యాణ్ ప్రకటించారన్నారు. టిడిపి బలహీనంగా ఉంది కాబట్టి జనసేన యువరక్తం దానికి ఎక్కించాలి అని పవన్ చెప్పారు. పవన్ మాటలను చూస్తే ప్రధానంగా చెప్పాలంటే మూడు అంశాలు ఉన్నాయి. ఎన్ డి ఏ నుంచి బయటకు వచ్చాను…టిడిపి పార్టీ పని ఐపోయింది…టిిడిపికి జనసేన ద్వారా యువరక్తం ఎక్కించి ఉత్సాహం నింపుతామని అంటున్నారు. ఆ పార్టీ బలహీనపడింది కాబట్టి జనసేన అవసరం ఉందని తెలియచేశారు.
ఎన్ డి ఏ నుంచి బయటకు వచ్చాను అనే అంశంపై బిజేపి స్పందించాలి. బలహీనపడిందని దానికి తెలుగుదేశం నేతలు కంపెనీ టేకోవర్ కు ఒప్పుకున్నారా అనేది చెప్పాలి. చంద్రబాబు భాాషలో చెప్పాలంటే ఆయన సిఇఓ కాబట్టి టిడిపి కంపెనీ కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. చిత్రమైన విషయం ఏమంటే టిడిపి నేతలు పవన్ కల్యాణ్ కు స్వాగతం చెబుతూ బైక్ ర్యాలీలు కూడా జరిపినట్లున్నారు.కనీసం గౌరవం కూడా టిడిపి నేతలకు ఇచ్చినట్లు కనబడలేదు. బలహీనపడిన టిడిపికి తాను సేవియర్ ను అని పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నాడు.
బలహీన పడిన పార్టీకి ఛాయిస్ ఉండదు కాబట్టి టిడిపికి ఎన్ని సీట్లు ఇస్తాడో పవన్ కల్యాణ్ చెప్పాలి. తెలుగుదేశం…జనసేనలు ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తాయో స్పష్టం చేయాలని కోరారు. ఎత్తిపోయిన కంపెని (టిడిపి)ని టేకోవర్ చేస్తుంటే టేకోవర్ చేసేవారికే షేర్లు ఎక్కువ వస్తాయన్నారు. జనసేన టేకోవర్ చేస్తుంటే జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలి. ఈ అనుమానాలను అటు టిడిపి ఇటు జనసేనలు రాష్ర్ట ప్రజలకు నివృత్తి చేయాల్సి ఉందన్నారు.
ఈ మధ్య పవన్ కల్యాణ్ ఓ సభలో మాట్లాడుతూ మేం కూడా జగన్ లాగా పది 12 ఏళ్ళ నుంచి ఉన్నాం. జగన్ ఫస్ట్ టైమ్ అధికారంలోకి రాలేదు. రెండోసారి వచ్చారు. మాకు కూడా అవకాశం వస్తే మేం కూడా అధికారంలోకి వస్తాం అన్నారు. పవన్ కల్యాణ్ కూడా పిఆర్ పి నుంచి లెక్కవేసుకుంటే జగన్ కంటే ఎక్కువకాలంనుంచే ఉన్నారు కాబట్టి సీట్ల విషయంలో టిడిపి,జనసేనలు స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు.
చంద్రబాబును జైలులో పెట్టింది వైయస్ జగన్ కాదు అని స్పష్టం చేసారు. కోర్టు చెప్పింది కాబట్టే జైలులో ఉన్నారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాదానంగా చెప్పారు. ఆయా కేసులకు సంబంధించి లోకేష్ తోపాటు వారి లాయర్లు అటు ఢిల్లీలోనుి బెయిల్ కోసం ఇక్కడ యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్లింది అధికారిక సమావేశంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలువురుని కలిసేందుకు అనేది గమనించాలన్నారు.
కేంద్ర,రాష్ట్ర సంబంధాల విషయంలో వైయస్ జగన్ బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరి వల్లనే రాష్ట్రానికి గతం కంటే ఎక్కువే సాధించారన్నారు. అవి కళ్లకు కనబడుతూనే ఉన్నాయన్నారు. టిడిపి నేతలు పొద్దుపోని ఆరోపణలతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం వైయస్ జగన్ కు లేదన్నారు. చంద్రబాబు గతంలో 60..70 సార్లు ఢిల్లీ వెళ్లి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా తన పర్సనల్ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు.హోదా కాకుండా ప్యాకేజి,పోలవరం ప్రాజెక్టు తానే కడతానని తెచ్చుకోవడం,అందులో డబ్బులు దండుకోవడం అందరికి తెలుసు. ఆ రికార్డు లన్నీ కూడా జగన్ కి పులమాలని చూస్తే నిలబడదు అన్నారు.
చంద్రబాబు కుంభకోణంలో దొరికారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని కోర్టుకూడా నమ్మింది. స్కిల్ స్కామ్ లో పారిపోయిన పెండేల శ్రీనివాస్ మిగిలినవారిని చంద్రబాబు త్వరగా పిలిపించి సిఐడికి అప్పగిస్తే మంచిదన్నారు. ఎందుకంటే దోచుకున్న నిధులు చంద్రబాబు మనుషులకే అప్పగించామని పారిపోయిన వ్యక్తులు చెప్పారన్నారు. చంద్రబాబు లాయర్లు 17 ఏ అనే అంశం పై గురించి మాత్రమే మాట్లాడుతున్నారన్నారు.
స్కామ్ జరిగిందని చంద్రబాబు లాయర్లు గుర్తించారు కాబట్టే వారు మాట్లాడలేకపోతున్నారన్నారు. టిడిపి ఏ పని చేయలేక ఓ రోజు పళ్లేలు వాయించారన్నారు. చిన్నపిల్లలతో కూడా కారుకూతలు కూయించారన్నారు. అలాంటిది లాయర్లు..జడ్జిలను కూడా వదులుతారా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. వైయస్ జగన్ గురించి లోకేష్ పనిపాటాలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్సించారు.
కృష్ణా ట్రిబ్యునల్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… కృష్ణా ట్రిబ్యునల్ కు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. కృష్ణాజలాల ఇష్యూకు సంబంధించి టిడిపి రాజకీయంగా మాట్లాడుతోంది. దీనిపై ఏ కాంట్రావర్సి ఉన్నా ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం…లా ప్రకారం ఏ రకంగా కౌంటర్ చేయాలనేది స్టేట్ పరంగా చూస్తారు. ఆ ప్రకటన నిన్ననే వచ్చింది. టిడిపి,ఆ పార్టీ బాకాలుగా ఉండే మీడియా,పత్రికలను చూస్తే కూడా ఇంకా ముఖ్యమంత్రి రియాక్ట్ కాలేదని ఏ వేవో ప్రశ్నలు వేస్తూ రాశారు.
ఈ విషయంలో రియాక్ట్ అయ్యే ముందు టెక్నికల్ పర్సన్స్ చూస్తారు. లీగల్ గా చూస్తారు. రాజకీయంగా దానిని ఏం చేయాలనేది ఆలోచిస్తారు. దానిపై ఇమిడియెట్ కామెంట్ చేయడమనేది మిస్ ఇన్ ఫర్మేషన్ లా ఉంటుంది. సరైనదిగా ఉండదు. వాళ్ళు రాజకీయవిమర్శలు చేస్తున్నారు. వాస్తవంగా చూసినా అది నిలబడదు అని అంటున్నారు.స్టడీ చేయాల్సి ఉంది. ఏదైనా తిరగదోడడం అనేది సరైనది కాదని అనిపిస్తోంది. దీనికి సంబంధించి డిపార్ట్ మెంట్ నుంచి కాని,మినిస్టర్ నుంచి కాని లీగల్ విభాగం నుంచి కాని రియాక్ట్ అవుతారు అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.