Suryaa.co.in

Telangana

ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్ వేడుకలు నిషేధం

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై జన్మదిన వేడుకల సందర్భంగా అర్ధ రాత్రి కేక్ కటింగ్ వేడుకలపై జీ‌హెచ్‌ఎమ్ సీ నిషేధం విధించింది.ఇలా వేడుకలను జరుపుకుంటున్న వారందరు మద్యం బాటిళ్లు, మాంసం, ఇతర వ్యర్థాలను పడేయడం తో అపరిశుభ్రత నెలకొటుంది.అదే విధంగా నీళల్లో చెత్తా చెదారం వేసినా చర్యలు ఉంటాయని జీ‌హెచ్ ఎమ్‌సీ అధికారులు హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఉన్నాయని, ఎవరు కూడా ఈ నిషేదాజ్ఞాలు ఉల్లగించినా వారిని రికార్డయినా దృశ్యాల‌తో గుర్తించి చర్యలు తీసుకుంటామని జీ హెచ్‌ఎమ్‌సీ అధికారులు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE