– అధ్వాన్నంగా రోడ్లు
– గుంతల్లో పది వేలాది మంది మృత్యువాత
-రోడ్డు పరిశీలనలో టీడీపీ, జనసేన నాయకులు
రాజమహేంద్రవరం : నగరంలోని రోడ్లన్నీ చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, ఇలా అయితే ప్రజలు ఎలా వారి ప్రమాణాలు సాగిస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ ఇంచార్జ్ అత్తిలి సత్యనారాయణ అన్నారు. ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఇరు పార్టీల నాయకులు కలిసి నందం గన్ని రాజు జంక్షన్ సమీపంలో శిథిలమైన రోడ్డును పరిశీలించారు.
అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్ల విషయంలో రాష్ట్ర అంత ఇదే పరిస్థితి నెలకొందన్నారు. పరదాల చాటున దాక్కుని పర్యటనలు చేసే ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రంలో శిథిలమై అవే రోడ్లపై వెళుతున్న ప్రజల ఇబ్బందులు జగన్ కు తెలియడం లేదన్నారు. వర్షాలు వచ్చే సమయంలో అవే గుంటల్లో రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో అవి రోడ్ల లేక చెరువుల అనే అనుమానం కలుగుతోందన్నారు.
అవే గుంతల్లో పది వేలాది మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలోని రహదారులన్నీ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు.