వైసీపీ నేతలు కొట్టేసిన 14 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ పై సర్వహక్కులకే భూహక్కు..భూరక్ష
• విజయసాయిరెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీనేతలు కొల్లగొట్టిన పేదల భూములపై వారికి సర్వహక్కులు కల్పించాలన్నదే జగన్ దురాలోచన
• చీమల పుట్టల్లోకి పాములు దూరినట్టు నాలుగేళ్ల జగన్ పాలనలో వైసీపీనేతలు, దళితులు..ఇతరవర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారు
• ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద నాలుగున్నరేళ్లలో ఒక్క దళితుడికైనా జగన్ నాలుగు సెంట్లు ఇచ్చాడా?
• నాలుగేళ్లలో ఒక్క దళిత, గిరిజనుడికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వని వ్యక్తికి హక్కులు కల్పించే అధికారం..అర్హత ఎక్కడి నుంచి వస్తాయి?
• వైసీపీవాళ్లే చుక్కలు పెడతారు..చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తామని భూ యజమానుల నుంచి అందినకాడికి దోచేస్తారు
• రెండుసార్లు తూతూమంత్రంగా భూముల సర్వే జరిపించి సర్వేరాళ్లపై.. పాసుపుస్తకాలపై తన బొమ్మలు వేసుకున్నాడు
• ఇప్పుడు మూడోవిడత సర్వే అంటూ రాష్ట్రంలో అక్కడక్కడా మిగిలిన అసైన్డ్.. 22ఏ.. చుక్కల భూములు.. గిరిజన భూములకే ఎసరు పెట్టాడు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
పేదలకు భూపంపిణీ పేరుతో జగన్ రెడ్డి ఏలూరులో ఆర్భాటంతో కూడిన అసత్యాలతో తన అక్కసు మొత్తం చంద్రబాబుపై వెళ్లగక్కాడని, భూపంపిణీ భూములపై సర్వహక్కులు కల్పిస్తున్నాను అనిపైకి చెబుతున్న జగన్ రెడ్డి.. మరోపక్క సెజ్ లు, థర్మల్ పవర్ ప్లాంట్లు..ఇతర కారణాలు చెప్పి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల ఎకరాల పేదల భూములు లాక్కున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఆక్రమించుకున్న అసైన్డ్ భూముల్లో ఒక్క ఎకరమైనా తన తండ్రి దళితులకు తిరిగిచ్చాడని జగన్ రెడ్డి నిరూపించగలడా?
“ రాష్ట్రంలో దళితులు.. బీసీలు.. ఇతర వర్గాల సాగులో ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని ఇళ్లపట్టాల కోసమని.. అభివృద్ధికోసమని కట్టుకథలు చెప్పి వైసీపీ నేతలు అడ్డగోలుగా లాగేసుకున్నారు. జగన్ రెడ్డి ఇడుపుల ఎస్టేట్ లోనే దళితులకు చెందిన అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఆ భూములు తిరిగి ఇస్తున్నట్టు అసెంబ్లీలోచెప్పి తప్పించుకున్నాడు. ఒక్కఎకరం కూడా దళి తులకు తిరిగివ్వలేదు.
దళితులభూములు ఆక్రమించుకున్న దోపిడీ కుటుంబం రాజశేఖర్ రెడ్డిది.
దళితులభూమి ఒక్క ఎకరమైనా రాజశేఖర్ రెడ్డి వెనక్కు ఇచ్చినట్టు కడపజిల్లా కలెక్టర్ చెప్పగలడా? జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దళితుల నుంచి తన కుటుంబం కొట్టేసిన భూములకు చుట్టూ కంచె వేసుకొని వాటిని అనుభవిస్తున్నాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన పెద్దదోపిడీదారు పేదలకు భూ హక్కులు కల్పిస్తానని చెప్పడం ముమ్మాటికీ నమ్మకద్రోహమే. తన తాత..తండ్రి ఆక్రమించుకున్న అసైన్డ్ ల్యాండ్స్ ను దళితులకు ఇచ్చాకే జగన్ రెడ్డి భూహక్కులపై మాట్లాడాలి.
విజయసాయిరెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీనేతలు కొల్లగొట్టిన పేదల భూముల పై వారికి సర్వహక్కులు కల్పించడానికే జగన్ రెడ్డి భూహక్కు-భూరక్ష అని కట్టు కథలు చెబుతున్నాడు
ఇప్పుడు కొత్తగా జగన్ రెడ్డి భూములపై సర్వహక్కులు కల్పిస్తానని చెప్పడం కూడా తన స్వప్రయోజనాల్లో భాగమే. నాలుగేళ్లలో వైసీపీనేతలు.. జగన్ వర్గానికి చెందిన వారు దళితుల్నిభయపెట్టి.. బెదిరించి… బలవంతంగా భూముల్ని తమ పేర్లపై రాయించుకున్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి రూ.40వేల ఎకరాలు కొల్లగొట్టాడు. అలానే జిల్లాలవారీగా వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరులు కాజేసిన భూములపై.. వారికే సర్వహక్కులు కల్పిస్తానని జగన్ రెడ్డి అంటున్నాడు గానీ..నిజమైన భూ హక్కుదారులకు కాదు.
ఎల్.టీ.ఎస్ (ల్యాండ్ పర్చేజ్ స్కీమ్) కింద ఎస్సీ కార్పొరేషన్ దళితులకు ఇచ్చిన 22,837 ఎకరాలపై హక్కులు కల్పిస్తున్నట్టు జగన్ రెడ్డి చెప్పాడు. చంద్రబాబు 2014-19మధ్య దళితులకు 5,386 ఎకరాలు కొని దళితులకు ఇచ్చారు. అంతకు ముందు కూడా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ద్వారా ఆయనే దళితులకు వేల ఎకరాల భూములు కొనిచ్చాడు. నాలుగున్నరేళ్లలో అదే స్కీమ్ కింద జగన్ రెడ్డి ఏ ఒక్క దళితుడి కైనా ఒక్కఎకరం భూమి కొనిచ్చాడా? కొనివ్వడం కాదుకదా.. దళితులు ఏళ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూముల్ని ఇళ్లపట్టాల పేరుతో బల వంతంగా గుంజుకున్నాడు. పేదలకు సెంటుపట్టాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు, మంత్రులు రూ.7వేల కోట్ల వరకు ప్రజలసొమ్ముని దిగమింగారు.
1954 నుంచి నాటి ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములకు జగన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా హక్కులు కల్పించేది ఏమిటి? దళితుల్ని మభ్యపెట్టి.. వారి ఆర్థిక అవసరాలు.. ఇబ్బందుల్ని ఆసరాగా తీసుకొని వైసీపీనేతలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వారి అధీనంలోని భూముల్ని లాగేసుకున్నారు. అలా లాక్కున్నవారి పక్షాన జగన్ భూహక్కులు అంటున్నాడు గానీ.. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడానికి కాదు.
చుక్కల భూములకు చుక్కలు పెట్టడం..ఎంచక్కా అందినకాడికి దోచేయడం. ఇదేగా జగన్ రెడ్డి..అతని పార్టీ వాళ్లు చేసింది
చుక్కల భూములకు చుక్కలు పెడుతోంది జగన్ రెడ్డి..అతని ప్రభుత్వమే. 2 లక్షల ఎకరాల భూములుంటే వాటిలో లక్షా50వేల ఎకరాలకు జగన్ రెడ్డి అతని పార్టీ వారే చుక్కలు పెట్టించి..భూయజమానుల్ని భయపెట్టి, వారి నుంచి అందిన కాడికి దండుకున్నారు. భూ సర్వేకు సరైన యంత్రాంగం లేదు. రాష్ట్రంలో రెండు సార్లు జరిగిన సర్వేనే అంతా తప్పుల తడక. సర్వే రాళ్లపై తనబొమ్మలు వేసుకోవ డానికి.. పాసుపుస్తకాలపై తన ఫొటోలు వేసుకోవడానికే జగన్ రెడ్డి ఉత్తుత్తి సర్వే లతో జనాల్ని మోసగించాడు.
గతంలో జరిగిన సర్వేలన్నీ తప్పుల తడకలుగా ఉంటే.. వాటిలోని లోపాలను సరిదిద్ది భూయజమానులకు న్యాయం చేయకుండా .. మరలా కొత్తగా మూడో విడత సర్వే చేయించి, రైతుల్ని, భూహక్కుదారుల్ని ఇంకా ముంచేస్తానంటున్నాడు. చీమల పుట్లలో పాములు చేరినట్టు వైసీపీవారే దళితులు.. ఇతర వర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారు. అసైన్డ్ ల్యాండ్స్.. చుక్కల భూములు.. 22ఏ భూములు..వక్ఫ్ భూములు అన్నీ చెరబట్టారు. ఒక్క సెంటుభూమికైనా గిరిజనులకు జగన్ రెడ్డి ఆర్.వో.ఎఫ్.ఆర్ పట్టా ఇచ్చాడా?
జగన్ రెడ్డికి ఓట్లేసినందుకు జనాలకు నాలుగున్నరేళ్లుగా ఏడుపే మిగిలింది బాబాయ్ ను చంపించి అధికారంలోకి వచ్చిన గొడ్డలిపోటు దారు జగన్ రెడ్డి
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే దళితులపై దారుణాలు ఎక్కువయ్యాయి. దళితుల్ని చంపే హక్కుని తనపార్టీ వారికి రాసిచ్చినట్టుగా జగన్ నాలుగేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. తానే నిజమైన పేదవాడు అన్నట్టు జగన్ పత్తిత్తుకబుర్లు చెబుతున్నాడు. చంద్రబాబుని వెన్నుపోటుదారు అంటున్న జగన్ రెడ్డిని మించిన గొడ్డలిపోటు దారు మరొకరు ఉండరు. బాబాయ్ ని చంపి, అధికారంలోకి వచ్చిన ఘనుడి రక్తచరిత్ర ప్రజలకు తెలియదా?
తండ్రి చనిపోగానే శవాన్ని పక్కనే పెట్టుకొని ముఖ్యమంత్రి కావడంకోసం ఎమ్మెల్యేల సంతకా లు సేకరించాడు. 2019లో జగన్ రెడ్డి ఏడుపు చూడలేకే ప్రజలు నమ్మి ఓట్లేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు జనాలకు ఏడుపే మిగిలింది. మరలా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా… జగన్ రెడ్డిని, అతనిపార్టీని సాగనంపుదామని ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు దళితుల్ని అలా అన్నాడు.. ఇలా అన్నాడని నోటికొచ్చిన ట్టు అబద్ధాలు చెప్పడం కాదు జగన్ రెడ్డి.. దమ్ముంటే ఎక్కడ ఎవరిని ఏమన్నాడో నిరూపించాలి.” అని ఆనంద్ బాబు సవాల్ చేశారు.