Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనలో దళితులపై జరుగుతున్న దమనకాండపై సాక్షి పత్రిక బహిరంగ చర్చకు సిద్దమా?

-ఎన్.సి.ఆర్.బి రిపోర్టుపై తప్పుడు కధనాలు రాయడం సాక్షి పత్రిక మానుకోవాలి
– తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్ రాజు

రాష్ట్రంలో వైకాపా నాలుగున్నరేళ్ల పాలనలో దళితులుపై 6 వేలకు పైగా దాడులు జరిగాయి. దాదాపు 150 మందికి పైగా దళితులు హత్యకు గురయ్యారు. దళిత దీనజనోద్ధారకుడిలా ఊదరగొట్టే జగన్ పాలనలో వారానికి 4 గురు హత్యలకు, 6 గురు హత్యాయత్నాలకు, రోజుకు ఇద్దరు దాడులకు, వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దళితులపై దాడుల్లో ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో 7వ స్థానంలో ఉంది. (Karnataka – 1,977, Telangana – 1787, Tamilnadu – 1761, Kerala -1050, Andhra Pradesh – 2315).

జాతీయ నేర గణాంక సంస్థ (NCRB) లెక్కల ప్రకారం దళితులపై 2020 లో 1950, 2021 లో 2014, 2022 లో 2315 నేరాలకు పాల్పడ్డారు. గత ఏడాదితో పోలిస్తే 2022 లో దళితులపై 14.5 శాతం నేరాలు పెరిగాయి. దేశంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో 4 శాతం ఏపీలోనే చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర నేరగణాంక సంస్థ తెలిపిన ఈ వాస్తవాలను దాచిపెట్టి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే దళిత, గిరిజనులకు రక్షణ అంటూ సాక్షి తప్పుడు కధనాలు రాస్తోంది.

కేంద్ర సంస్థల రిపోర్టులను సైతం వక్రీకరించేలా సాక్షి తప్పుడు రాతలు మానుకోవాలి. రాష్ట్రంలో వైకాపా పాలనలో దళిత-గిరిజనులపై దమనకాండ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దళితుల పక్షాన పోరాటం చేస్తోంది. దళితులపై దాడులకు సంబంధించి కేంద్ర నేరగణాంక సంస్థ తెలిపిన వివరాలుపై, తెదేపా చెబుతున్న లెక్కలపై సాక్షికి అనుమానం ఉంటే బహిరంగ చర్చకు రావాలి. దళిత-గిరిజనులపై వైకాపాకు, సాక్షి యాజమాన్యంకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా దీనిపై స్పందించాలి.

LEAVE A RESPONSE