-పాదయాత్ర చిత్రపటాలను బహూకరించిన లోకేష్ యాదవ్
-సచివాలయంలో కేక్ కట్ చేసిన భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను రాష్ట్ర సచివాలయంలో టిపిసిసి అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరము పురస్కరించుకొని భట్టి విక్రమార్కతో విద్యార్థి నాయకులు కేక్ కట్ చేయించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేతగా పాదయాత్ర చేసినటువంటి ఫోటోలను టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా బహుకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి బస్సుల్లో బయలుదేరి నిరుద్యోగ విద్యార్థి నాయకులు సచివాలయానికి చేరుకొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు
ఈ సందర్భంగా లోకేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీలకు 60 శాతం అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ మల్లు భట్టి విక్రమార్క 1365 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించారు అందుకుగాను ఈరోజు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సన్మానించినామని తెలియజేశారు.