కర్నూల్ : వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కర్నూల్ ఎంపీ టికెట్ కేటాయించారు. తాను ఎంపీగా పోటీ చేయనని.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానని జయరాం చెబుతున్నారు. ఇటీవల కార్యకర్తలతో సమావేశం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ గ్యాప్ లో గుమ్మనూరు కాంగ్రెస్ నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.