Suryaa.co.in

Andhra Pradesh

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించనున్న లోకేష్

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి లోకేష్ బయలుదేరనున్న లోకేష్ 9గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకొని స్వామివారి పూజల్లో పాల్గొంటారు. 10.30కి అక్కడనుంచి బయలుదేరి సున్నిపెంట చేరుకొని, అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

LEAVE A RESPONSE