కేసీఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి

– ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయి.

మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే… మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతుండు. హరీష్ రావు గారు… పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు. అవాకులు చెవాకులు పలకడం కాదు… ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండి.

కేసీఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి..మా ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం. ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా… నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఉన్నాం. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి..ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుల్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదు.

Leave a Reply