Suryaa.co.in

Andhra Pradesh

వామపక్షాలతో పొత్తు

– హోదా విషయంలో జగన్,బాబు విఫలం
– ఆళ్ల రామకృష్ణ రెడ్డి నాకు దగ్గర మనిషి
– ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ శాసిస్తుంది
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

వైసీపీ టీడీపీ లు బీజేపీ కి బానిసలు. బీజేపీ కి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్. ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నాం. కలిసి పోరాడే అంశంపై చర్చలు చేశాం. మేమంతా కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం. కలిసి కట్టుగా లేక పోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యం. అనంతపురం సభకు సీపీఐ సీపీఎం లను ఆహ్వానించా.

ఎన్నికల్లో సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేది. హోదా విషయంలో జగన్,బాబు ఇద్దరు విఫలం అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేది. మోడీ తిరుపతి లో మాట ఇచ్చి హోదా పై మాట మార్చారు. రామభక్తులు అని చెప్పుకుంటే సరిపోతుందా ?

ఆళ్ల రామకృష్ణ రెడ్డి నాకు దగ్గర మనిషి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి..సమానంగా ఉండాలి..సంతోషంగా ఉండాలి. ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడులు ఉన్నాయి. ఆయన చెల్లెలి గా నేను అర్థం చేసుకున్న. ఒక మంచి పర్సన్ ,ఒక రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు.

సీపీఎం నేత శ్రీనివాసరావు ఏమన్నారంటే.. బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. బీజేపీ, వైసీపీ టీడీపీ మీదనే మా పోరాటం. ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయి.రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ శాసిస్తుంది. బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన బాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు డిల్లీ చుట్టూ తిరగడం లేదు. ఇన్ని సార్లు తిరిగిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రాజధానికి నిధులు లేవు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహకారం తీసుకుంటాం. అందరం కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ దృష్ట కూటమిలను ఓడగొడతాం. బీజేపీ నీ,వారికి కాపు గాసే వారిని సాగనంపుతాం.

సీపీఐ నేత రామకృష్ణ ఏమన్నారంటే.. బీజేపీ మత తత్వ రాజకీయం. బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తె అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉంది. ప్రధాన మైన ప్రాంతీయ పార్టీలు బీజేపీ కి భయపడుతున్నారు. జగన్,బాబు,పవన్ మోడీకి దాసోహం అంటున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. ఇతర ప్రజా తంత్ర పార్టీలను కూడా కూడ గడతం. దేశంలో బీజేపీ మళ్ళీ అధికారం రాకూడదు. జగన్ 5 ఏళ్లు పాలనలో రాష్ట్రం సర్వనాశనం. ప్రజలను బిచ్చగాళ్ల ను చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. షర్మిలా రెడ్డి ని అరెస్ట్ చేయడం దారుణం.

LEAVE A RESPONSE