Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ పార్టీది పాకిస్థాన్ డీఎన్ఏ

-సుపారీ పార్టీ కాంగ్రెస్.. సుపరిపాలన చేస్తున్నది బిజెపి
-బీఆర్ఎస్ కు లబ్ధి చేసేందుకే కాళేశ్వరం ఫైళ్లు పక్కనపడేసిన కాంగ్రెస్
-హిందుస్థాన్ లో మేం 400 సీట్లు తెచ్చుకుంటాం.. మీరు పాకిస్థాన్ కు వెళ్లండి
-400 సీట్లలో బిజెపి విజయం సాధిస్తుంది.. కాంగ్రెస్ 40 సీట్లు కాపాడుకుంటే చాలు..
-తెలంగాణ ప్రజలను తెలివితక్కువ వాళ్లు అన్న బీఆర్ఎస్ కు తెలివైనవారెవరూ ఓటెయ్యొద్దు
-కవిత తీహార్ జైలుకు వెళ్లింది.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఆంధ్రకు వెళ్లాలి
-తెలంగాణలో కవిత అరెస్టు.. అవసరమా..? కాదా..?
-అదానీకి రూ. 12 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు కట్టబెట్టిందెవరు..?
-కాళేశ్వరం ప్రాజెక్టు స్కాంలో అసలు దోషులపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలే..?
-ఫోన్ ట్యాపింగ్ పై అసలు విషయాలను తప్పించి రేవంత్ సెంట్రిక్ గా రాజకీయాలెందుకు..?
-సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన రాణి రుద్రమ

హైదరాబాద్: దేశంలో సుపారీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అయితే.. సుపరిపాలనతో సుస్థిర అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. సుపారీ ఇచ్చి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ నేడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల వేల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ప్రశ్నిస్తున్న రేవంత్.. లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు అవసరమా.. లేదాననే విషయంపై స్పందించాలన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 400 సీట్లకు పైగా గెలుస్తుందని.. కాంగ్రెస్ కు ఉన్న 40 సీట్లను కాపాడుకుంటే చాలని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పదేపదే పాకిస్థాన్ పై లెస్స ప్రేమ ఒలకబోస్తోందని మండిపడ్డారు.

హిందుస్థాన్ లో గెలిచే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని, కాంగ్రెస్ పాకిస్థాన్ పారిపోవాలని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి.. ఎన్నికలకు తమ పాలనను రెఫరెండంగా ప్రకటించాలని సవాల్ విసిరారు. 60 ఏండ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించి.. నేడు ఉనికిని కాపాడుకోలేని నిరాశ నిస్పృహల్లో కాంగ్రెస్ మునిగిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ గారి పై విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాణి రుద్రమ మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ రాజకీయాల పట్ల పూర్తిస్థాయి అవగాహన లేనట్లుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి 5 స్థానాల్లో గెలిచేందుకు బిజెపి సుపారీ ఇచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నడు. సుపారీ ఇచ్చే భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో సుపారీ ఇచ్చి ఓటుకు నోటు కేసులో దొరికినవారే నేడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం దురదృష్టకరం.

బీఆర్ఎస్ పార్టీకి సుపారీ ఇవ్వాల్సిన అవసరం బిజెపి కి లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. గత పదేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్లతో తెలంగాణలో ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా పాలన అందిస్తున్నది నరేంద్ర మోదీ. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామంలో మోదీ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి అంటే అది భారతీయ జనతా పార్టీ ఘనతే. బిజెపి కి 400 సీట్లు రావాలంటే పాకిస్తాన్ లో పోటీ చేయాలని రేవంత్ రెడ్డి.. అసలు దేశంలో ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉన్నాయో తెలుసుకోవాలి.

543 పార్లమెంటు స్థానాల్లో 400 సీట్లు గెలావాలంటే భారతదేశంలో పోటీ చేస్తే సరిపోతది. హిందుస్థాన్ లో 400 సీట్లు గెలిచే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. పాకిస్థాన్ లో పోటీ చేసే అవసరం 40 సీట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీకి అవసరం. 2 స్థానాల నుంచి 303 స్థానాలకు వచ్చి.. నేడు 400 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే దిశగా బిజెపి వెళ్తున్నది.

కాంగ్రెస్ పార్టీకి పాకిస్థాన్ పై లెస్స ప్రేమ పుట్టుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే పాకిస్థాన్ డీఎన్ఏ. రాజీవ్ గాంధీకి, ఇందిరా గాంధీ కి, నెహ్రూ కి కూడా పాకిస్థాన్ పట్ల ఉన్న భారతదేశ ప్రజలకు తెలుసు. మరొకసారి నేడు కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్ పట్ల ప్రేమను చూపెడుతున్నరు. పాకిస్థాన్ పై ప్రేమ ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీని కూడా పాకిస్థాన్ తీసుకుపోతే సరి.

రాహుల్ గాంధీ గతంలో భారతీయ జనతా పార్టీకి 180 కంటే ఎక్కువ దాటవన్నడు.. నిన్న రేవంత్ రెడ్డి 240 సీట్లు దాటవని మాట్లాడిండు. రాహుల్ చెప్పే లెక్కలకు.. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఎక్కడా పొంతన లేదు. రేవంత్ రెడ్డికి అసలు రాజీకీయాలపై అవగాహన ఉందా..? భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయోననే దానిపైనే కాంగ్రెస్ నాయకుల ఆలోచన తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై లేదు. రేవంత్ రెడ్డికి చేతనైతే కాంగ్రెస్ కు ఉన్న 40 సీట్లను కాపాడుకునే ప్రయత్నం చేయాలి.

కాంగ్రెస్ పార్టీలోనే సుతి, గతి లేదు. బిజెపి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. అదానీకి మోదీ డబ్బు దోచిపెట్టారని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే రెడ్ కార్పెట్ వేసి అదానీని పిలిచి రూ. 12,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఎందుకు ఇచ్చినట్లు..? అదానీ జేబుదొంగ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన్రు. మరి, అదే అదానీకి తెలంగాణకు సంబంధించి రూ. 12 వేల కోట్లకు పైగా ప్రాజెక్టు పనులను ఎలా కట్టబెట్టారు..? ఇప్పటికైనా అసత్య ప్రచారాలు బంద్ పెట్టాలని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.

ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు అవసరమా అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న…! తెలంగాణలో కవిత అరెస్టు.. అవసరమా..? కాదా..? లిక్కర్ స్కాంలో కవిత నిందితురాలా..? కాదా…? బీఆర్ఎస్ పార్టీకి లాభం చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో స్కాంకు సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని లేఖలు రాసిన రేవంత్ రెడ్డి.. నేడు అదే సీబీఐకి ఎందుకు లేఖ రాయడం లేదు..?

ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చర్చ ఎందుకు నడుపుతున్నట్లు..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సెలబ్రిటీలు, ఆఫీసర్లను, వ్యాపారులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీ అరాచకం చేస్తే.. కేవలం రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే ఎందుకు చర్చ నడిపిస్తున్నారు..? కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో మీనమేషాలు లెక్కిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కు పర్మిషన్ ఇచ్చిన గత ముఖ్యమంత్రి, ఆయన కుమారుడితో పాటు మంత్రివర్గంలోని కీలక నాయకుల పేర్లు ఎందుకు నమోదు చేయడం లేదు..? కాంగ్రెస్ నాయకులు రామ మందిర్ అంశం పనిచేయడం లేదని అవినీతి అంశాన్ని ఎత్తుకుందని బిజెపి పై అవాకులు చెల్లుతున్నరు. అవినీతి అంశంలో రేపోమాపో ఓటుకు నోటు కేసు బయటకు వస్తుంది కాబట్టే రేవంత్ రెడ్డికి భయం పుడుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఎప్పుడిస్తున్నరు..? రైతులకు రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల భరోసా ఎప్పుడిస్తరు..? రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడిస్తున్నరు..? మహిళలకు రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 500 గ్యాస్ సబ్సిడీ పైసలు, ఆడపిల్లల వివాహానికి పెళ్లికి తులం బంగారం ఎప్పుడిస్తరు.. సమాధానం చెప్పాలి.

మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏది..? ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లకు శంకుస్థాపన చేశారు..? యువతకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఎప్పుడిస్తరు..? ఎంతమందికి చేశారో సమాధానం చెప్పాలి. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తరు..?

గృహజ్యోతి కింద ఇండ్లు ఎప్పుడు కట్టిస్తారో కూడా జవాబివ్వాలి. ఇండ్లు లేని వారికి ఇంటిస్థలం, రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఎప్పుడిస్తారు..? తెలంగాణ ఉద్యమకారులకు ఇంటిస్థలం ఎప్పుడిస్తారు..? వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్ రూ. 4 వేలు ఎప్పుడిస్తారు..?

పై ప్రశ్నలన్నింటికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిన తర్వాతే.. అబద్ధాల ప్రజాపాలననే రెఫరెండంగా పెట్టుకుని పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేవరకు భారతీయ జనతా పార్టీ వెంటబడుతుందని రేవంత్ రెడ్డి ని హెచ్చరిస్తున్నాం.

ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే తెలివాళ్లైన వాళ్లు అంటున్న బీఆర్ఎస్ నాయకులకు ఓటెయ్యొద్దు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మి మోసపోయారు కాబట్టి తెలివిలేనివారుగా కనపడుతున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఓట్లు, సీట్లు వచ్చాయి కాబట్టి ఆంధ్ర ప్రజలు తెలివైనవాళ్లు.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గి, ప్రభుత్వాన్ని కోల్పోతే తెలంగాణ ప్రజలు తెలివిలేనివాళ్లనేలా మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం.

అధికారం కోల్పోయినా కేటీఆర్ కు దొర దురహంకారం పోలేదు. మాకు ఆంధ్ర ప్రజల పట్ల ధ్వేషం లేదు.. కానీ, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పాకిస్థాన్ వెళ్తే.. కేటీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రాకి వెళ్లాలి.

LEAVE A RESPONSE