Suryaa.co.in

Andhra Pradesh

చేనేతలకు జగన్ చేసింది ఏమీలేదు

-చేనేతలపై జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలే
-ఎన్నికలకోసం చేనేతలపై జగన్ కపట ప్రేమ
-టీడీపీ పాలనలోనే చేనేతలకు మేలు
-50 ఏళ్లలోపు చేనేతలకు టీడీపీ హయాంలో పింఛన్, 119 కోట్ల రుణమాఫి
-మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప

చేనేతలపై జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని.. తాడేపల్లి ప్యాలెస్ వదలని జగన్ కు చేనేతలు అంటే ఎవరో తెలియదని.. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. టీడీపీ జూమ్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎలక్షన్ లో ఓట్లు దండుకునేందుకు చేనేతలపై జగన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని కిష్టప్ప అన్నారు. జగన్ పాలనలో 80 వేల మంది చేనేతలకు మాత్రమే లబ్ధి చేకూరిందన్నారు.

తాడేపల్లి కొంప నుండి బయటకు రాని జగన్ కు.. మిగిలిన చేనేతలు కనపడలేదా అని ప్రశ్నించారు? 100 మంది చేనేత కార్మికుల మృతికి జగనే కారణమన్నారు. చేనేతల ఉచిత విద్యుత్ సబ్సీడీకి గండి కొట్టారన్నారు. వైఎస్ఆర్ కూడా చేనేతలకు చేసింది ఏమీ లేదన్నారు. రాజారెడ్డి, నేడు జగన్ రెడ్డిల రౌడీ రాజ్యంలో చేనేతలపై దాడులు పెరిగాయన్నారు. చంద్రబాబు పెట్టిన నేతన్న నేస్తాన్ని జగన్ పెట్టానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

చంద్రబాబు హయాంలోనే చేనేతలకు మేలు జరిగిందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. దాదాపు 119 కోట్ల చేనేతల రుణాలు మాఫీ చేసి చేనేతలకు మేలు చేశారన్నారు. 50 ఏళ్లలోపు చేనేతలకు పింఛన్ అందించి భరోసా కల్పించార్నారు. టీడీపీ చేనేతల సంక్షేమానికి కృషి చేస్తే చేనేతలకు కేంద్ర ప్రభుత్వ సబ్సీడీలు అందకుండా జగన్ తుంగలో తొక్కాడని మండిపడ్డారు. చేనేల సంక్షేమాన్ని పట్టించుకోకుండా… చేనేతల ప్రాణాలు తీస్తున్న ఈ జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తప్పవకుండా చేనేత కార్మికులు బుద్ధి చెబుతారని తెలియజేశారు.

LEAVE A RESPONSE