Home » భయపడేది లేదు…నేతల బండారం బయటపెడతా

భయపడేది లేదు…నేతల బండారం బయటపెడతా

– తీహార్‌ జైలు అధికారి, జైళ్ల శాఖ మంత్రి బెదిరిస్తున్నారు
-స్టేట్‌మెంట్‌ ఇవ్వొద్దు అంటూ వత్తిడి చేస్తున్నారు

-అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
-సీఎం కేజ్రీవాల్‌, ఇతర నేతలకు సకల సౌకర్యాలు
-లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ

ఢల్లీి: తీహార్‌ జైలు నుంచి లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ జైలులో సకల సదు పాయాలు పొందుతున్నారని, అధికారం దుర్వినియోగానికి పాల్పడి తమకు నచ్చి న వారికి జైలులో పోస్టింగ్‌ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమిం చుకున్నారని తెలిపారు. జైలు అధికారి ధనుంజయ రావత్‌, అధికారుల ద్వారా మూడురోజుల నుంచి జైళ్ల శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ బెదిరిస్తున్నారని లేఖలో వివరించారు. స్టేట్‌మెంట్‌ ఇవ్వొద్దు అంటూ వత్తిడి చేస్తున్నారని, ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదని..నేతల బండారం మొత్తం బయట పెడతానని తెలిపారు.

Leave a Reply