Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ.. ఏ ఒక్కరి బిడ్డ కాదు

-జగన్ దోపిడీతో గ్రామాల్లో ప్రజల జీవితాలు అస్తవ్యస్తం
-జగన్ తీరుపై మండిపడుతున్న వైసీపీ సర్పంచ్ లు
-లోకేష్ హయాంలో నిర్మించిన రోడ్లకు డ్రైన్లు నిర్మించలేని దుస్థితిలో జగన్
-మీబిడ్డ మీబిడ్డ అంటూ జగన్ రెడ్డి ఊకదంపుడు మాటలు
-టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

జగన్ ఎవరి బిడ్డకాదు.. ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ
మీబిడ్డ మీబిడ్డ అంటున్న జగన్ రెడ్డి ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ అని ఏ ఒక్కరి బిడ్డ కాదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. గ్రామాల అభివృద్దికి జగన్ రెడ్డి చేసింది ఏమి లేదన్నారు. గ్రామాలను అభివృద్ధి చేకపోగా 13 వేల కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించడం దారుణమన్నారు. జగన్ దోపిడీలతో గ్రామాల్లో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. జగన్ చర్యలతో గ్రామ సర్పంచ్ లు లబోదిబో మంటున్నారని తెలిపారు.

టీడీపీ నిర్మించిన భవనాలకు వైసీపీ రంగులు… వైసీపీ సర్పంచుల ఆగ్రహం
టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలకు వేలకోట్లతో వైసీపీ రంగులు పులుమడం దారుణని మాణిక్యరావు అన్నారు. గ్రామాల అభివృద్ధిని వదిలేసి రంగులకోసం డబ్బులు వృథా చేయడాన్ని తప్పు బట్టారు. గ్రామాల్లో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ రెడ్డి మరుగుదొడ్లను నిర్వీర్యం చేశారన్నారు. మరుగు దొడ్లకు బడిపిల్లల వద్ద జగన్ దోచుకున్నారన్నారు. జగన్ రెడ్డి పాలనలో గ్రామాలు చీకట్లలో మగ్గుతున్నాయన్నారు. వైసీపీ చర్యలపై ఆ పార్టీ సర్పంచ్ లు కూడా తీవ్ర అసహనం, ఆగ్రహంగా ఉన్నారన్నారు.

విధ్వంసక జగన్ రెడ్డి
అభివృద్ధి చేయడం చేతగాని జగన్ రెడ్డి.. గ్రామాల్లో అభివృద్ధిని గాలికొదిలేసి విధ్వంస పాలనకు తెరలేపారన్నారు. గ్రామాలను వల్లకాడు చేశారన్నారు. ఎన్ఆర్ ఈజీఎస్ నిధులను 40 వేల కోట్లు కొల్లగొట్టారన్నారు. పరిపాలన జగన్ కు చేతగాదని ఎద్దేవ చేశారు. గ్రామాల్లో కనిస మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ప్రజావేదిక కూల్చినట్లు గ్రామాల్లో అభివృద్ధిని నిట్టనిలువునా పాతిపెట్టారన్నారు. జగన్ నిర్మించే వ్యక్తి కాదని విధ్వంసం చేసే వ్యక్తి అన్నారు. సంక్షేమం పేరుతో దోపిడీకి తెరలేపి పంచాయతీల నిధులను పక్కదారి పట్టించి కొల్లగొట్టారన్నారు.

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను, ఆగ్రామాల అభివృద్ధిని గంగలో కలిపి పరిపాలనకు, అభివృద్ధికి తేడా లేలియకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ఉన్న రాజధానిని ధ్వంసం చేసి రాజధాని ఆగిపోవడంతో అక్కడ ఉన్న ఐరన్ ను దోచుకున్నారని విమర్శించారు. గ్రామాల అభివృద్ధిని మరిచిన ఈ విధ్వంసక జగన్ రెడ్డికి గ్రామాల్లో ఉన్న ప్రజలే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారన్నారు. ఇంకుడు గుంతలు, వాటర్ ప్లాంట్ లు, ఫామ్ పారాలను జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. లోకేష్ హయాంలో నిర్మించిన రోడ్లకు సైడ్ డ్రైన్ లను కూడా నిర్మించలేకపోయారన్నారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి
టీడపీ అధినేత చంద్రబాబు నాయడు, మాజీ పాంచయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగిందన్నారు. యువతకు ఉద్యోగాల కోసం భారీగా పరిశ్రమలు తెచ్చారన్నారు. రైతులకు నీరు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారన్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. బడి పిల్లల భవిష్యత్ కోసం కృషి చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించే నాయకులనే జనం ఎన్నుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కే జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ది చెప్పాలన్నారు.

LEAVE A RESPONSE