• 7,500 కోట్ల డీఏ కు అతీగతీ లేదు
ప్రభుత్వం కట్టాల్సిన సీపీఎస్ కట్టడం లేదు
• జగన్ రెడ్డి చర్యలతో ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే
• జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉద్యోగులు
• కూపన్ లు, గిఫ్ట్ లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్న వైసీపీ
• ఉద్యోగుల ఓట్ల కోసం కుయుక్తులు మొదలు పెట్టిన జగన్ రెడ్డి
• టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
గడిచిన ఐదేళ్లు ఉద్యోగులను ఏడిపించి నేడు మళ్లీ ఉద్యోగులకు గిఫ్ట్ లు, కూపన్ లు ఇచ్చి ఉద్యోగుల ఓట్లను కొట్టేయడానికి జగన్ రెడ్డి ప్రలోభాలకు తెరలేపాడని.. కొత్త కుయుక్తులు పన్నుతున్నాడని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
చారిత్రాత్మకమైన అంశాలతో దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ పోరాటాలతో ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పోస్టల్ బ్యాలెట్ ఖచ్చితం అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే విధానం సులువు అయ్యింది. ఏపీలో యువత పెద్ద ఎత్తున ఓట్లను నమోదు చేసుకున్నారు.
2024లో దాదాపు 10 లక్షల కొత్త ఓట్లు నమోదు అయ్యాయి. ఇంటి నుండి కదల్లేని స్థితిలో ఉన్న ఓటర్ల కోసం మ్యానువల్ బ్యాలెట్ పేపర్ సదుపాయం కల్పించడం జరిగింది. 85 సంవత్సరాలు దాటిన వారికి పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి.
గతంలో 2 నుండి 3 లక్షలలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండేవి. గత ఎన్నికల్లో 59 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఇన్వాలిడ్ ఓట్లపై ఎన్నికల అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. 2024లో రికార్డ్ బ్రేక్ అయ్యేలా దాదాపుగా 4,54,686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. గతంలో బ్యాలెట్ పేపర్లు బయటకు ఇవ్వడంతో అది మిస్ యూజ్ అయ్యేది.
ఈ సారి ఆ అవకాశం లేదు. మే 13 కంటే ముందే ఓటు హక్కు వినియోగంచుకునేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఎలక్షన్ కమిషన్ చర్యలతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరగడం హర్షణీయం. ప్రైవేట్ వ్యక్తులు ఎన్నికల విధుల్లోకి తీసుకుంటున్న ఎలక్షన్ కమిషన్ వారు ఓటు వినియోగించుకునేందు పోస్టల్ బ్యాలెట్ సమయం పెంచే దిశగా ఎలక్షన్ కమిషన్ పని చేస్తుంది.
వైసీపీ రివర్స్ పీఆర్సీతో ఉద్యోగస్తులు తీవ్రంగా నష్టపోయారు. 7,500 కోట్ల డీఏ కు అతిగతి లేదు. ప్రభుత్వం కట్టాల్సిన సీపీఎస్ కట్టడంలేదు. వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేకుండా పోయింది. లిక్కర్ షాపుల వద్ద, బాత్రూమ్ వద్ద ఉద్యోగులను నిలబెట్టి అవమానించారు. పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకుని ఉద్యోగులను అవమానించిన వైసీపీకి బుద్ధి చెప్పాలి. గిఫ్ట్ లు ఇచ్చి ఉద్యోగులను వైసీపీ మరోసారి మోసం చేయాలని చూస్తుంది. వైసీపీ మోసాలకు వలలో ఉద్యోగులు పడకండి.
ఉద్యోగస్తులు తమ సమస్యలపై ధర్నా చేస్తుంటే ఉద్యోగ సంఘాలను పిలిచి వైసీపీ బెదిరించింది. టీడీపీ పాలనలో ఎప్పుడు కూడా ఉద్యోగస్తులను బెదిరించలేదు. ఉద్యోగులు విధులను సక్రమంగా చేయమని చెప్పింది. ఉద్యోగులను గౌరవించింది. వైసీపీలో పడ్డ కష్టాలు, నష్టాలు తీరాలంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను టీడీపీకి వేసి గెలిపించాలి.
టీడీపీ పాలనలోనే ఉద్యోగస్తులకు మేలు జరిగింది. గౌరవం దక్కింది. నేడు టీడీపీ అందరి సంక్షేమం కోసం పాటు పడుతుంది. అందరికి ఆరోగ్యం కోసం ప్రత్యేక చొరవ తీసుకుని, యూనివర్షల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను తీసుకు వచ్చింది. నిధులు ఇవ్వకపోవడంతో , వైసీపీ పాలనలో ఉద్యోగులకు సరైన వైద్యం కూడా అందలేదు. కూటమి తీసుకు వచ్చిన స్కీమ్ తో ఉద్యోగులకు కూడా బెన్ఫిట్ ఉంటుంది.
రాష్ట్రంలో ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. వైసీపీ పాలనలో ఉద్యోగస్తుల్లో ఏ వర్గానికి మేలు జరగలేదు. ఉద్యోగులను మోసగించిన జగన్ ను ఇంటికి పంపాలి.