Home » ముస్లింల 4 శాతం రిజర్వేషన్ కాపాడతాం

ముస్లింల 4 శాతం రిజర్వేషన్ కాపాడతాం

– మళ్లీ జగన్ వస్తే మీ ఊరికి గొడ్డలి వస్తుంది
– కూటమి మేనిఫెస్టో కళకళ – జగన్ మేనిఫెస్టో వెలవెల
– మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నేరవేర్చానన్న జగన్ – మద్యం నిషేదం అమలు చేశాడా? – సీపీఎస్ రద్దు చేశాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అంటూ 2019 వైసీపీ మేనిఫెస్టో చూపిస్తూ ప్రశ్నించిన చంద్రబాబు
– పీఎం బటన్ నొక్కినా ఏనాడు జగన్ లా ప్రచారం చేసుకోలేదు
– రాయచోటి ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
-పట్టాదారు పాస్ పుస్తకాలపై నీ బొమ్మ ఎందుకు జగన్ అంటూ ప్రశ్నించిన చంద్రబాబు

రాయచోటి:- కడప ఎవరి ఇలాకా కాదు. ఏ పెత్తందారు కింద బానిసలుగా పని చేయాల్సిన అవసరం లేదు. మే 13న గెలుపు మనదే. అభివృద్ధికి పునాది వేసుకోవాలి. సైకో జగన్ రాయచోటికి ఏమైన పనులు చేశారా? కనీసం కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా? కడప జిల్లాల్లో ఒక్క సాగు నీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశాడా? కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి. ఎంపీ అయితే కేంద్రంలో ఉండి పనులు చేస్తారు. కడప జిల్లాలో కరువు ఉందని అధికారులు చెబితే పట్టించుకోలేదు. 99 శాతం హామీలు అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి సున్నా మార్కులు ప్రజలు వేశారు. ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఆదాయం పెరిగిందా? ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు పెరిగాయా? ఇది ఒక కూతలు ప్రభుత్వం.

2019 ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి తరువాత గుద్దులు గుద్దారు
నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఐదేళ్లల్లో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. క్వార్టర్ రూ.60 నుంచి రూ.200కి అమ్ముతున్నారు. అంటే రూ.140 ఎవరి జేబులోకి వెళుతుంది. సైకో జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ కి పోతుంది. నాశిరకం మద్యం అమ్ముతున్నారు. తమిళనాడు, తెలంగాణలో నాణ్య మైన మద్యం ఇక్కడ దొరకడం లేదు. అంతా జే బ్రాండ్లు వచ్చేశాయి. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చానని జగన్ చెబుతున్నారు. మద్యపాన నిషేదం చేశాకో ఓటు అడుగుతానన్నాడు? చేశాడా? మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు.

వారంలో సీపీఎస్ రద్దు చేస్తానన్నాడు. పీఆర్సీ, ఇంటిరీయమ్ రిలీఫ్ ఇస్తానన్నాడు చేశాడా? జాబ్ క్యాలెండర్, డీఎస్సీ పెట్టాడా? ఉద్యోగాలు వచ్చాయా? జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి. రాష్ట్రాన్ని గంజాయి మయం చేసిన దుర్మార్గుడు జగన్. జర్నలిస్టులు, ఉద్యోగస్థులకు ఇళ్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా? ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టిలకు పనుల్లో 50 శాతం రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా? 2019 ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి వరాలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక బాధుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు.

భూమి మీది బొమ్మ జగన్ దా?
పట్టాదారు పాస్ పుస్తకంపైన ఏ నాడైనా ఏ ముఖ్యమంత్రి అయినా బొమ్మలు వేసుకున్నామా? కాని జగన్ మాత్రం పట్టాదారు పాస్ పుస్తకంపై బొమ్మ వేసుకుంటున్నాడు. పత్రాలు ప్రజలవి బొమ్మలు జగన్ వా? ఆస్తి నాదా జగన్ దా అని వైసీపీ నాయకులను ప్రశ్నించాలి. జగన్ లాండ్ గ్రాబియింగ్ యాక్ట్ తీసుకువస్తున్నారు. ఇది వస్తే మీ భూమి మీది కాదు. అన్ని కంప్యూటర్ ఉంటాయి. ఒరిజినల్ కాపీలు తన దగ్గర ఉంచుకొని డూప్లూకేట్లు ప్రజలకు ఇస్తారంటా అవి ఇస్తే తగలబెట్టండి మేం అధికారంలోకి వచ్చాక వాటన్నింటిని వెనక్కి ఇప్పిస్తాం.

అవినాష్ రెడ్డి పిల్లాడైతే బడికి పంపాలి గాని పార్లమెంట్ కి ఎందుకు?
హూ కిల్డ్ బాబాయ్. ఎవరు చంపారో ప్రజలందరికి తెలుసు. పక్కనే నిందితుడిని పెట్టుకొని పాపం పిల్లవాడు అని జగన్ అంటున్నారు. పిల్లవాడు అయితే పలకా, బలపం ఇచ్చి బడికి పంపాలి గాని పార్లమెంట్ కి పంపిస్తారా? మళ్లీ జగన్ వస్తే మీ ఊరికి గొడ్డలి వస్తుంది. ఒంటిమిట్టలో చేనేత కార్మికుడి భూమి రికార్డులు మార్చేస్తే ఎవ్వరూ సమాధానం చెప్పకపోవడంతో ఏం చేయలేక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల ప్రాణాలకు భద్రత లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి సైకో జగన్.

పీఎం బటన్ నొక్కినా ఏనాడు జగన్ లా ప్రచారం చేసుకోలేదు
ఎన్నికల ప్రజా మేనిఫెస్టో తెచ్చాం. సకల జనులకు న్యాయంతో గలగలలాడుతుంది. జగన్ మేనిఫెస్టో వెలవెలబోతుంది. దమ్మున్న మేనిఫెస్టో మనది. ఏమీ లేకుండా ఎత్తిపోయిన మేనిఫెస్టో సైకో జగన్ ది. సంపద సృష్టించడం తెలియాలి. ఆదాయం తెచ్చి ప్రజలకు పంచాలి. కానిజగన్ మాత్రం బటన్ నొక్కాలి అంటున్నారు. ఆ మాత్రం బటన్ నొక్కేందుకు జగన్ రెడ్డి కావాలా? ముఖ్యమంత్రి అయితే పేదల జీవన ప్రమాణాలు పెంచాలి, పిల్లలను బాగా చదవించాలి, ప్రాజెక్టులు కట్టించాలి. ప్రధాన మంత్రి కూడా బటన్ నొక్కుతూనే ఉంటూరు కాని ఆయన ఎక్కడా చెప్పలేదు.

ఆరోగ్య శ్రీకి బకాయిలు పెట్టడంతో ఆసుపత్రులు పేషెంట్లని చూడని పరిస్థితి
ప్రతి ఒక్కరికి పింఛన్ తెచ్చాం. మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తాం. రూ.200 పింఛన్ చేసింది టిడిపి. ఇప్పుడు రూ.3వేల నుంచి రూ.4వేలు చేస్తున్నాం. కాని 2028కి రూ.250, 2029కి రూ.250 పెంచుతానని జగన్ అంటున్నారు. ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ మొదటి తారీఖునే ఇంటి దగ్గరే ఇస్తాం. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇస్తాం. కాళ్లు, చేతులు లేకుండా అవస్థలు పడుతున్న వారికి రూ.15వేలు పింఛన్. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తాం.

చంద్రన్న బీమాతో చనిపోతే రూ.5 లక్షలు, ప్రమాదశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇస్తాం. మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం. ఆరోగ్య శ్రీ డబ్బులు రాని పరిస్థితి. రూ.1500 కోట్లు డబ్బులు కట్టకపోవడంతో పేషెంట్లు చూడమని ఆసుపత్రులు పడకేశాయి. ఆరోగ్య బీమా కింద రూ.25 లక్షలు ఇచ్చే బాధ్యత మాది. మండల హెడ్ క్వార్టర్ లో జనరిక్ మెడికల్ షాపులు పెట్టి తక్కువ ధరలకు ఇస్తాం. బీపీ, షుగర్ పేషెంట్లకు మందులు ఇంటికి ఉచితంగా పంపిస్తాం.

కడప హజ్ హౌస్ కి 10 శాతం పనులు పూర్తి చేయలేదు
తెలుగు దేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతు తెలిపారు. ఎన్డీఏ తెలుగుదేశం భాగస్వామ్యంలో 1995 ఉర్దూ విశ్వవిద్యాలయం, హాజ్ హౌస్ కట్టాం. విభాజిత రాష్ట్రంలో కడపలో హజ్ హౌస్ లు 90 శాతం పూర్తి చేస్తే జగన్ మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేదు. హజ్ యాత్రికులకు రూ. లక్ష సాయం అందిస్తాం. దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్యను జగన్ రెడ్డి ఎందుకు తీసేశారు?

మౌజన్, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చాం, షాదీఖానాలు, మసీదులను నిర్మించి, మరమ్మత్తులకు నిధులు ఇస్తాం. నూరుభాషా కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్లు ఇస్తాం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఇమామ్, మౌజన్ లకు రూ.10వేలు, రూ.5వేల గౌరవ వేతనం ఇస్తాం. 4 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడతాం. మేం మసీదులు కట్టిచ్చాం. కాని జగన్ పట్టించుకోలేదు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడానికి కృషి చేస్తే కాని జగన్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ముస్లింలకు రక్షణ లేదు. ఎవరి ఆస్థికి రక్షణ లేదు. మైదకూరులో ముస్లిం భూమిని ఆక్రమిస్తే ఎవరూ పట్టించుకోలేదు.మళ్లీ దుల్హన్, విదేశ విద్య, రంజాన్ తోఫా ఇస్తాం.

డ్రైవర్ల కోసం సాధికార సంస్థ
బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. రూ.1.50 లక్ష కోట్లు ఐదేళ్లలో పెట్టి బీసీల రుణం తీర్చుకుంటాం. నాయిబ్రాహ్మణులకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తాం. చేనేత కార్మికులకు మరమగ్గాలకు 500 యూనిట్లు, హ్యండ్ లూమ్స్ కి 200యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తాం. కాపు సంక్షేమానికి రూ.15వేల కోట్లు ఖర్చు పెడతాం. రాయలసీమలో ఒక్క బలిజ కూడా సీట్లు ఇవ్వని వ్యక్తి జగన్. బీసీలకు సీట్లు ఇవ్వన్ని పార్టీ వైసీపీ. టిడిపి అందరికి సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం చేశాం. డ్రైవర్ల కోసం సాధికర సంస్థ పట్టి ఆదుకుంటాం.

బాడ్జి ఉన్న ఆటో, ట్యాక్స్, హెలీ లైసెన్స్ ఉన్న డ్రైవర్స్ కి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఆటో కొనాలంటే రూ.4 లక్షల వరకు 4 శాతం వడ్డీకి ఇప్పిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇస్తాం. అంటే ఐదేళ్లల్లో రూ.90వేలు ఇస్తాం. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తాం. ఉచితంగా గ్యాస్ సిలెండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రోడ్లన్ని బాగు చేసే బాధ్యత నాది. విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం. చెత్తపన్ను రద్దు చేస్తాం. విషపూరిత బ్రాండ్లన్ని రద్దు చేస్తాం.

రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి భూగర్బ డ్రైనేజి పేరుతో కోట్లు కొట్టేశారు. ముబారక్ నగర్, భారత్ పెట్రోల్ బంక్, చిత్తూరు రింగ్ రోడ్ లో లాండ్ కబ్జా, రూ.200 కోట్లు కొట్టేశారు. వీళ్ల ఆటలు సాగనివ్వం. రాయచోటి జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుంది. వెల్లిగల్లలో శ్రీనివాస పురం జరికోన రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. 10 శాతం పనులు చేయలేని దద్దమ్మలు వైసీపీ నాయకులు. రాయచోటిలో ఇంటింటికి మంచి నీరు ఇస్తాం. మైనారిటీ జూనియర్ కాలేజీ ఇస్తాం. మైనారిటీల కోసం పాలిటెక్నిక్ కాలేజీ పెడతాం. మైనారిటీ కోసం ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాయచోటికి పరిశ్రమలు తెస్తాం, వ్యవసాయం అభివృద్ధి చేస్తాం. సంపద పెంచి ఆదాయం పెంచి బాధ్యత మాది. గెలుపు మనదే, విజయం మనదే, భవిష్యత్ మనదే

Leave a Reply