Home » జగన్ రెడ్డి ముస్లిం ద్రోహి

జగన్ రెడ్డి ముస్లిం ద్రోహి

-జగన్ రెడ్డి పాలనలో ముస్లింలపై దాడులు
-వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేదు
-ముస్లింల ఆస్తులను వైసీపీ నేతలు దోచుకుంటుంటే జగన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు
-జగన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన -ఒక్క హామీని అమలు చేయలేదు
-టీడీపీ పాలనలోనే ముస్లింలకు న్యాయం
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

జగన్ రెడ్డి పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయి… ముస్లింలకు రక్షణ లేదు. జగన్ మేనిఫెస్టోలో ముస్లింలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. జగన్ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు.

మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం పెట్టిన దుకాన్ మకాన్ పథకాన్ని జగన్ ఎత్తేశాడు. మైనార్టీ కార్పొరేషన్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. వక్ఫ్ బోర్డు ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఆస్తులను రీ సర్వే చేయించి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపధికన వాటిని పరిరక్షిస్తూ… స్థిర ఆస్తులను డిజిటలైజేషన్ చేసి ఆయా వర్గాలకు ఉపయోగపడేలా ప్రత్యేక ప్రణాళిక చేస్తానని చెప్పావు చేశావా జగన్ రెడ్డి. వైసీపీ నేతలు, నీ ఎమ్మెల్యేలు ముస్లింల ఆస్తులు కైంక్యర్యం చేస్తుంటే ముస్లింల ఆస్తులను కాపాడే ప్రయత్నం చేయలేదు.

ముస్లిం మైనార్టీ చెల్లెమ్మలకు వైఎస్సార్ పెళ్లి కానుక రూ. 1 లక్ష ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా మోసం చేశావు. టీడీపీ ప్రభుత్వంలో వెలమందికి దుల్హాన్ ఇచ్చారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం చేస్తానని ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇమామ్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఒక్క ఇళ్లు కూడా కట్టలేదు. టీపీపీ పాలనలో ఇమామ్ లకు ఇచ్చిన డబ్బులు కూడా వైసీపీ ఇవ్వలేదు. ముస్లింల పండుగకు ఇచ్చిన రంజాన్ తోఫాను రద్దుచేసి పేదల పొట్ట కొట్టాడు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వైఎస్సార్ బీమా కింద 5 లక్షలు ఇస్తానని మట్టి ఖర్చులకు కూడా ఇవ్వలేదు.

సజ్జల రాసిన కాగితం చదువుకుంటూ…. జగన్ కు ప్రెస్ మీట్ పెట్టాలన్నా భయమే. టీడీపీ మేనిఫెస్టోకు, వైసీపీ మేనిఫెస్టోకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పాదయాత్రలో జగన్ చెప్పిన హామీలపై టీడీపీ పుస్తకం వేసింది. అందులో 700 హామీలు ఇస్తే 60 కూడా నెరవేర్చలేదు. అయినా ఇంకా జగన్ రెడ్డి అబద్దాలతో కాలం గడుపుతున్నాడు. 50 ఏళ్లకే మైనార్టీలకు పింఛన్లు ఇస్తానని చెప్పాం. జగన్ రెడ్డి అది చెప్పలేకపోయాడు. ఎందుకంటే జగన్ రెడ్డికి సందప సృష్టించడం చేతకాదు కాబట్టి.

ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్థాన్ లకు టీడీపీ స్థలాలను కేటాయిస్తామని హామి ఇచ్చింది. దీన్ని ముస్లింలు స్వాగతించారు. టీడీపీ హయాంలో కట్టిన హజ్ హౌస్ లల్లో మిగిలిన 10% పనులు పూర్తి చేసి జగన్ రెడ్డి ప్రారంభించలేకపోయాడు. నూర్ భాషాలను గౌరవించి రూ. 100 కోట్లను కేటాయించడం జరిగింది. ఇమామ్ లకు రూ. 10 వేలు, మౌజామ్ లకు రూ. 5 వేలు ఇస్తామని చెప్పాం ఖచ్చితంగా ఇచ్చితీరుతాం. వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి ఇమాముల్లో ఖాజీలను నిమించి ఆస్తులను పర్యవేక్షించడానికి చట్టం తీసుకు వస్తామని చెప్పాం. ఇవి కాకుండా నిరుద్యోగ బృతి, తల్లికి వందనంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్ని ముస్లిం సమాజానికి వర్తిస్తాయి.

ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ ను తొలగిస్తారని జగన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇసుకను అందకుండా చేసి ముస్లిం కుటుంబాలకు పనులను దూరం చేశాడు. డీజీల్ పెట్రోల్ ధరలు పెంచి, కరెంట్ ఛార్జీలను మోపి పేదలపై భారం మోపాడు. నేడు ఈ ధరలను టీడీపీ తగ్గిస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే ముస్లింలకే ఎక్కువ మేలు జరుగుతుంది. జగన్ రెడ్డి ముస్లింల ద్రోహి. చంద్రబాబు ముస్లింల శ్రేయోభిలాషి. జగన్ పాలనలలో ముస్లింలపై దాడులు పెరిగాయి. ముస్లింల ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి. రైళ్ల కింద పడి ఆత్మహత్యలు చేస్తున్నారు. పల్నాడులో 100 కుటుంబాల ముస్లింలు సొంత ఊరును వదిలి బయట ఊర్లలో తలదాచుకునే పరిస్థితి ఉంది. జగన్ రెడ్డి ముస్లిం ద్రోహిగా ఉన్నాడు… జగన్ రెడ్డిని ముస్లిం సమాజం ఓడించడం ఖాయం.

టీడీపీ బీజేపీతో పొత్తు ఉందని జగన్ రెడ్డి ముస్లింలను రెచ్చగొడుతున్నాడు. కేసుల కోసం ఇప్పటి వరకు బీజేపీతో ఉంది జగన్ రెడ్డే. జగన్ రెడ్డి మోసాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎన్టీఏలో భాగస్వామ్యం అయ్యింది టీడీపీ.

Leave a Reply