Home » మీరిక మారరా?

మీరిక మారరా?

– జగన్ రెడ్డి నిర్వాకం వలన పోలీసుల ప్రతిష్ఠ పాతాళానికి
– విశాఖలో పోలీసు వాహనంలో జగన్ రెడ్డి అవినీతి సొమ్మును ఓటర్లకు పంచడానికి రవాణా చేస్తున్న పోలీసు అధికారులను గుర్తించి సస్సెండ్ చేయాలి
– సాక్షి పత్రికలో అవాస్తావాలతో కూడిన ఆర్టికల్స్‌ను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించి సంబంధిత వైసీపీ అభ్యర్ధి ఎన్నికల ఖర్చులో జమ చేయాలి
– 90% పెన్షన్ పంపిణీ అయిందని సీఎస్ జవహర్‌రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారు. ఎంతశాతం పెన్షన్ దారులుకు చేరిందో చెప్పాలి
తెలంగాణాలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పోలింగ్ సమయాన్ని సాయత్రం 6 గం వరకు పెంచాలి
– తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య

రాష్ట్రంలో పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని, విశాఖలో పోలీసు వాహనంలోనే ఓటర్లకు పంచిపెట్టడానికి డబ్బులు సరఫరా చేశారని ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వాటితో పాటు సాక్షి పత్రికలో ప్రచురిస్తున్న అవాస్తవ ఆర్టికల్స్‌పై, పెన్షన్ వ్యవహారంలో జగన్ రెడ్డి చేసిన కుట్రలపై కూడా ఎన్నికల సంఘానికి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదరిగానే మన రాష్ట్రంలో కూడా పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరిన వర్ల. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య పాల్గొన్నారు.

”మీరు మారరా…!” అని రాష్ట్ర పోలీసులను ప్రశ్నించిన వర్ల….
“రాష్ట్రంలోని కొన్ని చోట్ల పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన రాష్ట్ర పోలీసులకు మంచి పేరు ఉండేది. కానీ నేడు జగన్ రెడ్డి నిర్వాకం వల్ల పోలీసులకు ఉండే మంచి పేరు పాతాళానికి పడిపోయింది. విశాఖపట్నంలో పోలీసుల వాహనంలో డబ్బులు చేరవేసి రాత్రి పూట కరెంటు నిలిపేసి డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంపిణీ చేయాల్సిన కర్మ నేడు పోలీసులకు పట్టింది. ఇటువంటి దిగజారుడు పనులు చేస్తున్న అధికారి ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడగలడు.

ప్రజా రక్షణకు, శాంతిభద్రతలు కాపాడడానికి ఉపయోంగించవలసిన పోలీసు వాహనాన్ని, జగన్ రెడ్డి అవినీతి సొమ్మును ప్రజలకు పంచేందుకు కాదు. పోలీసు ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారో డీజీపీ సమాధానం చెప్పాలి. ఇటువంటి వార్త పత్రికల్లో వస్తే వివరణ ఇవ్వండని , సంబంధిత తప్పు చేసిన అధికారికి నోటీసులు పంపించేవారు. కానీ నేడు అటువంటి వార్తలు వచ్చినందుకు సంతోషిస్తున్నారు. ఆత్మను చంపుకొని ఇటువంటి పనులు చేసిన అధికారులను గుర్తించి శిక్షించాలని ఈసీని కోరాం. లేదా ఇటువంటి పనులు మా వాళ్ళు చేయలేదని పోలీసు కమిషనర్‌ చెప్పాలి”అని వర్ల డిమాండ్ చేశారు.

అవినీతి పత్రిక సాక్షిలో అర్టికల్స్‌ను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలి….
“సాక్షి పత్రికకు నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రజల చెవిలో జగన్ రెడ్డి పూలు పెడుతుంటాడు. కానీ ఆ పత్రికలో అన్ని అవాస్తవాలతో కూడిన బుద్ది లేని పిచ్చి రాతలు రాస్తుంటారు. వైసీపీకి మేలు జరగేందుకు రాసే వార్తలను మాత్రమే సాక్షిలో ప్రచురిస్తుంటారు. ఇటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ పెయిడ్ ఆర్టికల్స్‌గా ఎన్నికల కమిషన్ పరిగణించాలి. ఇటువంటి వార్త ప్రచురించడానికి సాధారణంగా సాక్షి పత్రిక ఎంత తీసుకుంటుందో అంత ఫీజును ఆర్టికల్‌కు సంబంధించిన వైసీపీ అభ్యర్ధి ఎన్నికల ఖర్చులో జమ చేయాలి” అని డిమాండ్ చేశారు.

వృద్ధుల ఉసురు పోసుకుంటున్న సీఎం జగన్ రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి….
“90% పెన్షన్ పంపిణీ చేశామని సీఎస్ జవహర్‌రెడ్డి శుద్ధ అబద్ధాలాడుతున్నారు. డబ్బులు బ్యాంకుల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నామని బట్టన్ నొక్కారు. కానీ బ్యాంకు వద్దకు వృద్ధులు వెళ్ళి పెన్షన్ డబ్బును ఎంతమంది తీసుకున్నారో లెక్క లేదు. కానీ పాడేరు లాంటి కొన్ని చోట్ల బ్యాంకులు ఎక్కడ ఉన్నాయో కూడా వృద్ధులకు తెలియదు. కొంతమంది పెన్షన్ దారుల బ్యాంకు అకౌంట్‌లు ఫ్రీజ్ అయి ఉన్నాయి.

అటువంటి అకౌంట్‌లో జమ చేసిన పెన్షన్ డబ్బులు తిరిగి ప్రభుత్వానికే వస్తాయి. జగన్ రెడ్డి సేవలో తరించాలనే సీఎస్ ఆలోచనకు ఎంతోమంది వృద్ధులు కడుపు కోతకు గురవుతున్నారు. అందుకే బ్యాంకుల్లో ఉండే ఫెసిలిటేటర్స్‌లను పిలిపించి వారి ద్వారా అయినా పెన్షన్ పంపిణీ చేయించాలని సీఎస్‌ను మేము ముందే కోరాం. కానీ సీఎస్ జవహర్‌రెడ్డి మాత్రం వృద్ధులపై కక్ష గట్టి ఎంతమంది వృద్ధుల చస్తే అంత జగన్ రెడ్డికి మేలు కలుగుతుంది ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. జగన్ రెడ్డి వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాన్ని తెలుగుదేశం పార్టీపై మోపుతున్నారు. వీరు చేస్తున్న దుర్మార్గాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం” అని తెలిపారు.

ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్యతో పాటు శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తెదెపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు

Leave a Reply