నా దేహం నువ్విచ్చిందే
నా తత్వం నువ్విచ్చిందే
నా సద్బుద్ధి నువ్విచ్చిందే
నా జీవితం నువ్వు ఇచ్చిందే
నా జననం చూసి సంతోషించావు
నా చదువులు చూసి మరింత సంతోషించావు
నా ఎదుగుదల చూసి
ఎంతో ఆనందించావు
నా విజయం చూసి ఎంతోమందికి చెప్పుకున్నావు
నన్నెప్పుడూ వెనకుండే నడిపించావు
నా భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశావు
నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న
అందుకే
ఎన్ని జన్మలకైనా నీ బిడ్డగా నీ రుణం తీర్చుకునే భాగ్యం కోసం ఎదురుచూస్తూ….
హ్యాపీ ఫాదర్స్ డే
– శ్రీ (వై.శ్రీనివాసరావు)