Suryaa.co.in

Andhra Pradesh

సమస్యలు ఒకేసారి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వలేం

-ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
-ఉద్యోగ సంఘ నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోండి
-11 వ పిఆర్శీ బకాయిలు, 2018 నుండి పెండింగు ఉన్న డిఏ ల బకాయిలు చెల్లించేలా చూడాలి
-ఇ.హెచ్.యస్ ద్వారా క్యాష్ లెస్ ట్రీట్ మెంటు అందేలా చూడాలి
-12 వ పిఆర్శి కమిషన్ వెంటనే నియమించాలి
-కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామి మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలి
-రాష్ట్రాభివృద్ధికి ఏపిజేఏసి అమరావతి పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము
-ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు బొప్పరాజు, పలిశెట్టి
– ఉపముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు

అమరావతిః ‘‘గత ప్రభుత్వం హయాంలో జరిగిన 11 వ పిఆర్సి రివర్స్ పిఆర్సీ గా జరిగింది. ఆ నష్టాన్ని 12 వ పిఆర్సి ద్వారా భర్తీ అవుతుందన్న ఆశతో, రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు గత ప్రభుత్వం హయాంలో ఆర్దికంగా జరిగిన నష్టాలను ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చా లి. 11 వ పిఆర్శీ బకాయిలు,2018 నుండి చెల్లించాల్సిన డిఏ ల బకాయిలు చెల్లించి, ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని పొగొట్టేలా చూడాల’’ ని మంగళవారం జెనసేన పార్టీ ఆఫీసులో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ ని కలిసిన ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు,స్టేట్ అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు,స్టేట్ కోశాధికారి వి.వి.మురళికృష్టంనాయుడు కోరారు.

రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగుల కోరుకున్న ప్రభుత్వం అధికారం లోకి రావడంతో, ఈ కూటమి ప్రభుత్వం పై ఎన్నో ఆశలు ఉద్యోగులు పెట్టుకున్నారని చైర్మన్ బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులు ప్రధానంగా కోరుకున్న అంశాలలో బకాయిలు చెల్లించాలని, ప్రతి ఉద్యోగికి ప్రతినెలా 1 వ తేదీన జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలని, ఎన్డీఏ మేనిఫెస్టో లో హామీ ప్రకారం ఔట్ సోర్శింగు ఉద్యోగులకు, వారికుటుంబసభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అన్ని వర్తింప జేయాలని కోరారు.

కొత్త జిల్లాలలో పనిచేసేందుకు సరిపడే సిబ్బందిని నియమించాలని, కోవిడ్ సమయంలో చనిపోయిన జిల్లా పరిషత్ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపరెన్నుమరరీ పోస్టులు క్రియేట్ చేసి, కారుణ్య నియామాకాలు తక్షణమే కల్పించాలని, ఇ.హెచ్.యస్ ద్వారా ఉద్యోగులందరికీ క్యాష్ లెస్ ట్రీట్ మెంటు అందించేలా చూడాలని కోరారు.

రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లించేలా చూడాలని బొప్పరాజు విజ్ఞప్తి చేస్తూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ కి ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి తరపున ఉద్యోగుల సమస్యలపై లేఖ ఇచ్చారు.

ఉద్యోగుల బాధలు,సమస్యలు వినే ఓపిక నాకుంది. మీ సమస్యలు అన్ని ఒకేసారి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వలేం గాని, ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏపిజేఏసి అమరావతిలో ఉన్న అనుబంద సంఘాల రాష్ట్ర నాయకులు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు, ఏపిపిటిడి(ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, ఏపీ క్లాస్ -IV ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్. మల్లేశ్వరరావు, ఏపీ జెఏసి అమరావతి మహిళా విభాగం సెక్రటరీ జెనరల్ పొన్నూరు విజయలక్ష్మి, కోశాధికారి గంటాపావని, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య, ఎన్టీఆర్ జిల్లా జేఏసీ అమరావతి చైర్మన్ బత్తిన రామకృష్ణ, గుంటూరు జిల్లా జేఏసీ అమరావతి చైర్మన్ కే.సంగీతరావు, ఎన్టీఆర్ జిల్లా రెవిన్యూసర్వీసెస్ అసోషియేషన్ అద్యక్షడు డి.శ్రీనివాస్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య తధితరులు కలసి శుభాకాంక్షలు ఏపిజేఏసి అమరావతి మరియు అనుబంద సంఘాల రాష్ట్రకమిటి నాయకులు అందరు కలసి, డిప్యూటీ సియం పవన్ కళ్యాన్ కి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE