Suryaa.co.in

Andhra Pradesh Telangana

రేపు అల్పపీడనం

4 రోజులు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీకి అది వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఒడిశా, ప.బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఇక ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు కురవనున్నాయి.

LEAVE A RESPONSE