Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు విశ్వ విద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు

సోమనాథ కళా పీఠం విజ్ఞప్తి

పాలకుర్తి: తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని ఇటీవల శాసనసభలో ప్రస్తావించిండ్రు.

తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ వాదులు ఈ విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని బలంగా కోరుతున్నరు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చటానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోగలరని పీఠం విశ్వాసం వ్యక్తం చేసింది. సురవరం ప్రతాపరెడ్డి పేరును పాలమూరు విశ్వవిద్యాలయానికి పెట్టవచ్చునని సూచించింది.

సాహిత్యాభిమానులు, సబ్బండ వర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి తెలియ చెప్పి తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టించాలని పీఠం పిలుపు నిచ్చింది.

సమావేశంలో గౌరవ సలహాదారు వీరమనేని వెంకటేశ్వర్ రావు, అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, కార్యదర్శి ఇమ్మడి దామోదర్, సహాయ కార్యదర్శులు జక్కుల రవీందర్, మామిండ్ల రమేశ్ రాజా, కోశాధికారి రాపాక విజయ్, కార్యవర్గ సభ్యులు గుమ్మడిరాజుల సాంబయ్య, గూడూరు లెనిన్, డాక్టర్ రాపోలు వెంకటేశ్వర్లు, రాపాక రమేశ్, బజ్జూరి వేణుగోపాల్, మేరుగు మధుసూదన్ పాల్గొన్నరు.

LEAVE A RESPONSE