– బీఆర్ఎస్ కు మళ్లీ నిరాశే
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత.. అయితే, ఆగస్టు 7న తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు తెలిపింది.
సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు.ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జ్ కావేరి భవేజా వాయిదా వేశారు. కాగా.. కవితను మార్చి- 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్- 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.