– ఇదో ఠాగూర్ సినిమా
నర్సాపూర్: చిరంజీవి ఠాగూర్ సినిమా చూశారా? చచ్చిపోయిన వారికి సీరియస్‌గా ట్రీట్‌మెంట్ చేసి లక్షలు వసూళ్లు చేసిన సీన్లు గుర్తున్నాయా? ఇప్పుడు గచ్చిబౌలి కేర్‌లో సేమ్ టు షేమ్ సీన్ రిపీటయింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ (50) క్యాన్సర్‌తో బాధ పడుతూ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.. కేర్ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ కోసం రూ. 5.50 లక్షలు తీసుకున్నారు.డాక్టర్లు మూడు రోజుల నుండి వెంకటేష్‌ను కుటుంబ సభ్యులకు చూడనివ్వకుండా ఇంకా రూ. 4.50 లక్షలు కట్టాలని చెప్పారు.
దీంతో, అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఐసీయూ అద్దాలు పగలకొట్టి లోపలికి వెళ్లగా, అప్పటికే వెంకటేశ్ చనిపోయి ఉన్నాడు.. దీంతో శవానికి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.