Suryaa.co.in

Andhra Pradesh

కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’

  • రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అట్టగంటాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు

  • మా గెలుపు చూసి ఓర్వలేక తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు

  • ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా సరే జగన్ రెడ్డికి రెడ్ బుక్ కనిపిస్తుంది. కలలో కూడా రెడ్ బుక్ గుర్తుకు వస్తుంది

  • దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేసి కారులో డోర్ డెలివరి చేసినప్పుడు ఎందుకు పరామర్శకు వెళ్లలేదు?

  • సొంత బాబాయి గొడ్డలి వేటు పడి చనిపోతే ఆయన కుమార్తె అయినా సునీత పక్షాన కాకుండా ముద్దాయిల పక్షాన ఎందుకు ఉన్నావు జగన్ రెడ్డి?

  •  నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

మంగళగిరి, ఆగస్టు 9 : కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హింస, హత్యల గురించి జగన్ రెడ్డి మాట్లాడుతుంటే రావణాసురుడు రామాయణం చెప్తున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల కాలం జగన్ రెడ్డి పాలన అంతా కూడా ఎక్కడ కూడా ప్రజా పాలన అనేది కంటి కనిపించలేదని తెలిపారు.

జగన్ రెడ్డి పాలన అనే కంటే 144 సెక్షన్ పాలన అని చెప్పుకుంటే బాగుంటుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుల ఇంటికి దినపత్రిక కంటే ముందుగా పోలీసులను పంపి హౌస్ అరెస్టు చేసిన సంగతి గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి దుర్మార్గ, నియంకృత్వ పాలన నుంచి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ప్రజలకు విముక్తి కలిగిందని తెలియజేశారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయే కూటమికి చరిత్రను తిరగరాసే విధంగా ప్రజలు పట్టం కట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజాతీర్పును ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజలను మరోకసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని ముంచేశారని, 2014లో రాష్ర్ట విభజన తరువాత కలిగిన నష్టం కంటే జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనే విధ్వంసం సృష్టించింది. మళ్లీ అదే అబద్దాలే, అసత్యాలతోనే ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నంద్యాల జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన దళితులకు చెందిన ఎకరం 40 సెంట్లు భూమిని వైసీపీ నాయకుడు నారపరెడ్డి లీజుకు తీసుకుని, లీజు సమయం పూర్తయిన కూడా డబ్బులు ఇవ్వకుండా, వారిపై బెదిరింపులకు పాల్పడుతూంటే ఆ గ్రామ పెద్ద దళితులకు ఇవ్వాలని చెప్పిన పాపానికి నారపరెడ్డి, తన అనుచరులతో కలిసి ఆగస్టు 3న శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై, వారి సోదరుల ఇంటిపై దాడుల చేసిన సంగతి రికార్డులలో ఉన్నాయని, కుటుంబ కలహాల మధ్య జరిగిన తగదాల వల్ల సుబ్బారాయుడు మరణిస్తే దానికి కూడా రాజకీయ రంగు పులిమి టీడీపీకి అంటగట్టే విషప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు.

వినకొండ హత్యను సైతం టీడీపీ హత్యగానే ప్రచారం చేయిస్తున్న జగన్ మోహన్ రెడ్డి విఫలం చెందారని, అందువల్లే నంద్యాలలో ఈ డ్రామాకు తెరలేపారని తెలిపారు. జగన్ తన ఉనికి కాపాడుకునేందుకే ఇలాంటి విషప్రచారం చేస్తున్నారని, జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడంలో నేర్పరి అని ఎద్దేవా చేశారు. అదే విధంగా జగన్ రెడ్డి పదేపదే రెడ్ బుక్ ను కలవరిస్తున్నారని, జగన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఎక్కడ చూసిన ఏ రంగు చూసిన ఎరుపు రంగు మాత్రమే కనిసిస్తుందని ఎద్దేవా చేశారు.

డాక్టర్ సుధాకర్ అత్యంత దారుణంగా హత్య చేసినప్పుడు ఎందుకు పరామర్శించేందుకు వెళ్లాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతలు స్వీకరించి 50 రోజుల సమయంలో ప్రజల మద్దతు పొందుతున్నామని, అందుకే జగన్ రెడ్డి విషప్రచారం చేస్తున్నారని తెలిపారు. 14లక్షల కోట్ల అప్పుల భారంతోనే రాష్ర్టం పరిస్థితి ఉందని తెలిపారు. భావితరాలకు అస్తులే లేకుండా చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి చెందుతుందన్నారు. సూపర్ సిక్స్ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్, మోడీ సహకరం రాష్ర్టాభివృద్ధి చెందుతుందని తెలిపారు.

LEAVE A RESPONSE