Suryaa.co.in

Andhra Pradesh

లైఫ్‌ మిషన్‌లో ఒకే ఒక్కడు.. చంద్రబాబు నాయుడు

– లైఫ్‌ మిషన్‌లో తెలుగు రాష్ట్రాలు భేష్‌
– గ్లోబల్‌ ఛార్జ్‌ దిశగా భారత్‌ వడివడిగా అడుగులు
-ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంట్రిగ్రిషన్‌ ఆఫ్‌ మిషన్‌లైఫ్‌కు సమగ్రవిధానం
– 2070 నాటికి కర్బన ఉద్గారాల్ని సున్నాకు తీసుకురావడమే ముందున్న లక్ష్యం
– లైఫ్‌ మిషన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు
– ఇంధన సామర్థ్యానికి కీలక గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్‌
– చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌(సీఐసీ) హీరాలాల్‌ సమారియా
– ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన బీఈఈ

విజయవాడ : దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలు ప్రతిష్టాత్మకమైన, పర్యావరణహిత జీవన విధానాల కోసం మిషన్‌లైఫ్‌లో భాగస్వామ్యం కావాలని చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ (సీఐసీ) హీరాలాల్‌ సమారియా పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల్ని నియంత్రించే ప్రతిష్టాత్మక లక్ష్యాల్ని చేరుకునేందుకు భారత్‌ కీలక పురోగతి సాధించింది. ఇందులో భాగంగా మిషన్‌ లైఫ్‌ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సమగ్ర విధానాన్ని అవలంబించడం అభినందనీయమన్నారు.

భారత్‌ నేతృత్వంలో తీసుకుంటున్న ఈ చొరవ, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు, వ్యవస్థల్ని భాగస్వామ్యం చేస్తోందన్నారు. మిషన్‌లైఫ్‌ని ప్రపంచ ప్రజా ఉద్యమంగా మారుస్తూ ఉన్నత లక్ష్యాల వైపు దూసుకెళ్లడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2030 నాటికి ఒక బిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం, 2070 నాటికి నికర–సున్నా ఉద్గారాలను సాధించడం అనే కీలక లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్‌ నిబద్ధతతో వ్యవహరిస్తోందని అన్నారు. ఈ చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు లభించిందన్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక రంగాల్లో విధులు నిర్వర్తించిన, విద్యుత్‌ రంగంలో అపారమైన అనుభవం ఉన్న అధికారి సమరియా. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం, నీటి యాజమాన్య పద్దతులకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్‌–26లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం లైఫ్‌ మిషన్‌లో అన్ని వర్గాల ప్రజల్నీ భాగస్వాములు చేసే క్రమంలో జాతీయ, ప్రపంచ స్థాయి నిపుణులతో సంప్రదింపులు చేయడంలో భాగంగా బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ దక్షిణాది రాష్ట్రాలు, యూటీల సలహాదారు, లైఫ్‌ మిషన్‌ నోడల్‌ ఆఫీసర్‌(సౌత్‌) ఎ.చంద్రశేఖర్‌రెడ్డి సమారియాతో ఢిల్లీలో భేటీ అయ్యారు.

లైఫ్‌ మిషన్‌ ఆవశ్యకత, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దక్షిణాది రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలు, అనుసరిస్తున్న కమ్యునికేషన్‌ వ్యూహాల్ని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలు చేస్తున్న నిరంతర కృషిని సీఐసీ అభినందించారు.

ఈ చొరవ కారణంగానే 2022–23 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన మైలురాళ్లని అధిగమించినట్లు మీడియా అడ్వైజర్‌ వివరించారు. దేశ వ్యాప్తంగా బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో రూ.1,94,320 కోట్ల విలువైన 306 బిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ ఆదాని స్టేక్‌హోల్డర్స్‌ చేయగలిగారన్నారు. ఇది 24.68 మిలియన్‌ టన్నుల చమురు ఆదా(ఎంటీవోఈ)కు సమానం. ఈ తరహా చొరవతో ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తోందన్నారు.

బీఈఈ సూపర్‌ పెర్ఫార్మెన్స్‌..
లైఫ్‌ మిషన్‌ కార్యక్రమంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ పరిరక్షణకు బీఈఈ చేస్తున్న కృషిని సమారియా అభినందించారు. ముఖ్యంగా పెర్ఫార్మ్, అచీవ్‌ – ట్రేడ్‌ (ప్యాట్‌) పథకం సైకిల్‌–1లో జాతీయ ఇంధన పొదుపు 8.67 ఎంటీఓఈగా ఉందనీ.. 31 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాల్ని తగ్గించిందన్నారు. ప్యాట్‌ సైకిల్‌–2లోనూ అద్భుత ఫలితాలు బీఈఈ సాధించగలిగింది. ఈసారి ఏకంగా 14.08 ఎంటీవోఈ పొదుపుతో పాటు 68.43 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలు నియంత్రించడంలో కీలక పాత్ర పోషించిందని సమారియా ప్రశంసించారు.

లైఫ్‌(మిషన్‌)లో ఒకే ఒక్క సీఎం..
లైఫ్‌మిషన్‌ అమలులో దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని హీరాలాల్‌ సమారియా కొనియాడారు. కేవలం మూడు నెలల క్రితం నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు వాతావరణ మార్పుల నివారణకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు.

ఇందులో భాగంగా.. బీఈఈ లైఫ్‌ మిషన్‌ పోస్టర్‌ని తొలిసారిగా తానే స్వయంగా ఆవిష్కరించడం.. ముఖ్యమంత్రి దార్శినికతకు నిదర్శనమన్నారు. ఈ తరహా కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంధన సామర్థ్య ప్రయత్నాలలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య భూమిక పోషిస్తోంది.
అదే విధంగా ప్రపంచంలో అతి పెద్ద మహా నగరాల్లో ఒకటిగా భాసిల్లుతున్న హైదరాబాద్ మహా నగరంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో భవనాల్లో భారీ ఎత్తున విద్యుత్ పొదుపు సాధించేందుకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) అమలు, రవాణా రంగంలో కాలుష్య నియంత్రణకి ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈ-మొబిలిటీ) ప్రోత్సహించడంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. 2030 నాటికి ఏపీలో 6.68 ఎంటీవోఈ ఇంధన పొదుపు లక్ష్యాల్ని బీఈఈ నిర్దేశించింది. ఈ సందర్భంగా స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీ (ఏపీఎస్‌ఈసీఎం) చేస్తున్నకృషిని అభినందించారు.

ఎనర్జీ ఎఫిషియన్సీలో భారత్‌.. ఓ గ్లోబల్‌ లీడర్‌
2030కి ముందు 887 మిలియన్‌ టన్నుల ప్రొజెక్టెడ్‌ కర్బన ఉద్గారాల్ని తగ్గించేందుకు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్న రోడ్‌ మ్యాప్‌తో ఇంధన సామర్థ్యంలో భారత్‌.. గ్లోబల్‌ లీడర్‌గా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించడంలోనూ, పర్యావరణ మార్పులను పరిష్కరించడంలో 50% పైగా సహకారం భారత్‌ అందించింది.

బీఈఈ నివేదిక, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది బిలియన్ల మందిలో కేవలం ఒక బిలియన్‌ మంది లైఫ్‌ మిషన్‌ కార్యక్రమాలు, పర్యావరణ అనుకూల చర్యల్ని తమ దైనందిక జీవితంలో అవలంబిస్తే.. 20 శాతం వరకూ కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చని సీఐసీ సమారియా గుర్తు చేశారు.

అద్భుత విజయాలు సాధించిన ఆంధ్రప్రదేశ్‌
కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బీఈఈ, ఈఈఎస్‌ఎల్‌ ప్రవేశపెట్టిన అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమల్లో ఏపీ అగ్రగామిగా నిలిచింది. ఉజాలా పథకం ద్వారా 20141–15 నాటికే అందరికీ ఎల్‌ఈడీ బల్బులు అందుబాటులోకి తీసుకురావడం, స్ట్రీట్‌ లైటింగ్‌ నేషనల్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఎల్‌ఎన్‌పీ), అగ్రికల్చర్‌ డిమాండ్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌ (ఏజీడీఎస్‌ఎం), ఈ–మొబిలిటీ తదితర కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతంగా అమలయ్యాయి.

ఆయా కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాలు, ప్రధాన నగరాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది. 2014లో హుద్‌హుద్‌« ధాటికి అతలాకుతలమైన విశాఖ మహా నగరంలో ఎస్‌ఎల్‌ఎన్‌పీ పథకంలో ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీట్‌లైటింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం మూడు నెలల్లో 95,000కి పైగా సంప్రదాయ వీధిలైట్ల స్థానంలో ఇంధన సమర్థవంతమైన ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జీవీఎంసీ విద్యుత్‌ బిల్లులను గణనీయంగా తగ్గించుకోగలిగింది.

ఈ ప్రాజెక్ట్‌ ఇంధన వినియోగంలో 50% వరకూ తగ్గుముఖం పట్టింది. కనెక్టెడ్‌ లోడ్‌లో 7.9 మెగావాట్ల నుంచి 3.9 మెగావాట్లకు తగ్గడమే కాకుండా.. కార్పొరేషన్‌కు ఏటా దాదాపు 4.7 మిలియన్‌ డాలర్ల వార్షిక వ్యయం ఆదా చేయగలిగింది. ఇదే స్ఫూర్తితో 2019 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీలలో దాదాపు 29 లక్షల ఎల్‌ఈడీ వీధిలైట్లు పునరుద్ధరిస్తూ.. దేశంలో ఎస్‌ఎల్‌ఎన్‌పీ పథకంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్‌మోడల్‌గా నిలిచింది. ఇంధన సామర్థ్యంలో ఏపీ సాధించిన విజయాలకు సంబంధించిన సక్సెస్‌ స్టోరీల సమగ్ర నివేదికని ఏపీ విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలోని ఎస్‌ఈసీఎం ఎస్‌డీఏ సహకారంతో రూపొందిస్తున్నట్లు బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, యూటీ మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి సమారియాకు వివరించారు.

ఈ నివేదికతో పాటు తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాల సక్సెస్‌ స్టోరీల్ని ఇతర ప్రాంతాలకు అందించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల బీఈఈ, ఎస్‌ఈసీఎం అధికారులతో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై సమీక్షించిన ఏపీ ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్‌.. బీఈఈ లక్షా్యలను చేరుకోవడానికి, వినియోగదారులకు ఇంధన సామర్థ్య ఫలాలను అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఈఈ నుంచి అందిన ఆర్థిక సహకారంతో, ఎస్‌ఈసీఎం రాష్ట్రంలోని విద్యా సంస్థలలో సుమారు 1,000 ఇంధన సామర్థ్య క్లబ్‌లను స్థాపించిందని తెలిపారు.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇంధన ఆదాలో ఈఈఎస్‌ఎల్‌ సాధించిన విజయాల వివరాల్ని ఓసారి పరిశీలిస్తే…స్ట్రీట్‌లైట్‌ నేషనల్‌ ప్రోగ్రామ్‌(ఎస్‌ఎల్‌ఎన్‌పీ)లో..
పొదుపు ఫలితాలు భారత్‌లో ఏపీలోవార్షిక విద్యుత్‌ ఆదా 8989.66 మిలియన్‌ కిలోవాట్స్‌ 1980 మిలియన్‌ కిలోవాట్స్‌ పీక్‌ డిమాండ్‌ తగ్గుదల 1498 మెగావాట్స్‌ 330 మెగావాట్స్‌ కర్బన ఉద్గారాల నియంత్రణ 6.19 మిలియన్‌ టన్నుల సీవో2 1.36 మిలియన్‌ టన్నుల సీవో2

ఉజాలా పథకం ద్వారా…
పొదుపు ఫలితాలు భారత్‌లో ఏపీలో
వార్షిక విద్యుత్‌ ఆదా 47882 మిలియన్‌ కిలోవాట్స్‌ 2863 మిలియన్‌ కిలోవాట్స్‌
వార్షిక వ్యయం ఆదా రూ.19153 కోట్లు రూ. 1145 కోట్లు
పీక్‌ డిమాండ్‌ తగ్గుదల 9586 మెగావాట్స్‌ 573 మెగావాట్లు
కర్బన ఉద్గారాల నియంత్రణ 3,87,84,253 టన్నుల సీవో2 33,18,461 టన్నుల సీవో2

LEAVE A RESPONSE