ఐపీసీ చట్టాలంటే జగన్ కు భయం

Spread the love

– జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు.. కోర్టులుచెప్పినా.. ఎవరుచెప్పినా వినడు
– జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జేపీసీ అమలుచేస్తూ, రూల్ ఆఫ్ లాని , రాజ్యాంగాన్ని పక్కనపెట్టేశాడు – జగన్ రెడ్డి పాలసీ దొంగఓట్లు, దొంగనోట్లే. ఆపాలసీతోనే వచ్చేఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు
•ప్రతిపక్షాలను, మీడియాను అణచివేసి లబ్ధిపొందాలనుకుంటున్న జగన్ చర్యలు, నిర్ణయాలు అతనికే రివర్స్ అవుతాయి
• లోకేశ్ మాట్లాడకూడదు..చంద్రబాబు రోడ్డెక్కకూడదు.. మీడియా, ప్రజలు ప్రశ్నించడకూడదు అని ఏచట్టంలో ఉంది?
• జగన్ ప్రభుత్వనిర్ణయాలన్నీ రాజ్యాంగ విరుద్ధమే.. అందుకే కోర్టుల్లో ప్రభుత్వానికి, అధికారులకు చీవాట్లుపడుతున్నాయి.
• ప్రభుత్వపథకాలతో ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడితే, రాష్ట్రం పేదరికనిర్మూనలో 10వస్థానానికి ఎందుకుచేరింది?
• అప్పులసొమ్ము.. ప్రజలనుంచి వసూలుచేస్తున్నది.. రాష్ట్రంలోని సహజవనరుల లూఠీతో వచ్చేది సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా..లోటస్ పాండ్ లోఉందా?
• గూగుల్ టేకౌట్ అంటే ఏమిటో సజ్జలకు తెలుసా? అవినీతి, అక్రమాలతో పూర్తిగా మునిగిపోయి, ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారోనన్నభయంతోనే వివేకాహత్యకేసువిచారణపై బురదజల్లుతున్నారు
– తిరుపతి తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు

“జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, వ్యక్తుల స్వేచ్ఛ, ప్రశాంతత కు భంగంకలిగిస్తూ, ప్రతిపక్షాలప్రాథమిక హక్కుల్ని కాలరాసేలా వైసీపీప్రభుత్వం వ్యవహరి స్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తరుపునపోరాడే ప్రతిపక్షానికి కూడా అధికారపక్షంతో సమా నహక్కులు ఉంటాయి. ప్రజలు అధికారమిచ్చింది వారికి సేవచేయడానికే తప్ప, ప్రతిపక్షాల ను ప్రశ్నించే వారిని అణగదొక్కడానికి కాదు. ప్రభుత్వం ప్రజారంజకపాలన చేస్తే ప్రతిపక్షం పనిగట్టుకొని విమర్శలుచేయదు.

రాష్ట్రంలో ఐపీసీ చట్టానికి బదులు జేపీసీ (జగన్ పీనల్ కోడ్) అమలవుతోంది
ఐపీసీ చట్టం గురించి జగన్ కు తెలియదనే అనుకుంటున్నా. గతంలో ఆయన సీబీఐ, ఈడీకే సుల్లో జైలుకువెళ్లిన నేపథ్యంలో, ఐపీసీచట్టాల తాలూకా షాక్ ఆయనకు తగిలినట్టుంది. జగ న్ రెడ్డి గతంలో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొనే లక్షకోట్ల అవినీతికిపాల్పడితే, రూ.43వేల కోట్ల అవినీతిజరిగిందని ఈడీతేల్చింది. జగన్ రెడ్డి సంపాదించిన అవినీతిసొమ్ము, అక్రమార్జన అంతా ఎక్కడుందోచెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. అతనిగతచరిత్ర గానీ, ఇప్పుడు పరిపాలిస్తున్నతీరుగానీ గమనిస్తే, అవినీతి..అక్రమార్జన ద్వారా వచ్చినసొమ్ముతోనే ప్రభు త్వాలు ఏర్పాటుచేయవచ్చని భావిస్తున్నాడు. ప్రభుత్వాన్ని అవినీతిమయంచేసి ప్రజల్ని హింసిస్తూ పాలనసాగిస్తున్న వ్యక్తికి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. పోలీసులు కూడా ఐపీసీని పక్కనపెట్టి, జగన్ పీనల్ కోడ్ (జేపీసీ)ని ఫాలో అవుతూ, రూల్ ఆఫ్ లా, రాజ్యాంగాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అమల్లోకి వచ్చిన రాజ్యాంగమే భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. కానీ జగన్ దానికి విరుద్ధంగా వ్యవ హరిస్తూ ప్రతినిర్ణయం రాజ్యాంగవిరుద్ధంగానే తీసుకుంటున్నాడు. పార్లమెంట్ సాక్షిగా అమరా వతి రాజధాని అనిచెబితే, మూడురాజధానులు అని ఎలాఅంటారు. జగన్ ప్రభుత్వనిర్ణయా న్ని హైకోర్ట్ తప్పుపట్టింది. పార్లమెంట్ చేసిన చట్టాలనుకాదనే అధికారం రాష్ట్రాలకు లేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకూడా స్పష్టంచేస్తుందని భావిస్తున్నాం. మూడురాజధానుల చట్టం రాజ్యాంగవిరుద్ధమైనది కాబట్టే, శాసనమండలిలో కూడా దాన్ని అడ్డుకున్నాం. జేపీసీని ఆధారంగా చేసుకొని ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని, మీడియాను నియంత్రిస్తున్నారు. పాదయాత్రల్ని అడ్డుకోవడం అనేది రాష్ట్రచరిత్రలో మునుపెన్నడూలేదు. లోకేశ్ మాట్లాడ కూడదని మైక్ లాక్కోవవడం భావప్రకటనాస్వేచ్ఛను అడ్డుకోవడమే అవుతుంది. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేనప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకు లోకేశ్ ను అడ్డుకుంటోంది? ఎవరూ రోడ్లపై నడవకూడదు..ఏమీ మాట్లాడకూడదు.. ప్రజలకు అభివాదం చేయకూడదు అని చెప్పడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది. పాలసీలు చేసే హక్కు ప్రభుత్వానికి ఎం త ఉంటుందో, అదేవిధంగా ఆ పాలసీల్లోని లోపాల్ని, తప్పుల్ని ఎత్తిచూపే హక్కు, ప్రతిపక్షాని కికూడా అంతే ఉంటుంది. భావప్రకటనాస్వేచ్ఛ అనేది దేశపౌరులందరికీ ఉంటుంది. దాన్ని కాదనే అధికారం, హక్కు ఎవరికీలేదు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, చర్యలు అతనికి, ప్రభు త్వానికే రివర్స్ అవుతున్నాయి. ప్రజల్ని, ప్రతిపక్షాలను అణచివేసిలబ్ది పొందాలనుకోవడం అతనికే నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడితే, రాష్ట్రం ఎందుకింత అధోగతి పాలైంది? పేదరికనిర్మూనలో 10వస్థానానికి ఎందుకుచేరింది? అప్పులసొమ్ము.. ప్రజలనుంచి వసూలుచేస్తున్నది.. రాష్ట్రంలోని సహజవనరుల లూఠీతో వస్తున్నసొమ్ము అంతా తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా..లోటస్ పాండ్ లోఉందా?

ప్రభుత్వ పథకాలను ప్రజలకు నష్టాన్నే కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు అమలుచేసేపథకాలు వారిజీవనాన్ని మెరుగుపరిచేలా ఉండాలిగానీ, వారిని ఎందుకుపనికిరానివారిగా మార్చకూ డదు. రాష్ట్రంలోని ఇసుకను ఎవరుదోచుకుంటన్నారు..దానితాలూకా ఆదాయం ప్రభుత్వఖజా నాకు రాకుండా ఎటుపోతోంది? అలానే మద్యం, మైన్స్ నిర్వహణ ఎవరుచేస్తున్నారు. జగన్ రెడ్డి, అతని మనుషులకు మాత్రమే ఆదాయం వస్తోందిగానీ, ప్రభుత్వానికి, ప్రజలకు కాదు. రాష్ట్రంలోని సహజవనరుల్ని, ఖనిజసంపదను అధికారపార్టీనేతలే మింగేస్తుంటే, ప్రజలకు, రాష్ట్రానికి ఏం మేలుజరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్నిపరిశ్రమలు తీసుకొచ్చా డు…నిరుద్యోగయువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? వచ్చిన పరిశ్రమలకంటే రాష్ట్రం నుంచి తరిమేసినవాటిగురించి అయితే జగన్ రెడ్డి బాగాచెబుతాడు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగశాతం 8, 9శాతం ఉండొచ్చుకానీ, వాస్తవంగా 16, 17శాతం ఉంటుంది. మధ్యతరగ తి, పేదవారి ఆదాయప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. జగన్ రెడ్డిచర్యలతో ఎక్కువగా నష్టపోయింది పేద, మధ్యతరగతి ప్రజానీకమే. రాష్ట్రానికి ఏపరిశ్రమ వచ్చినా కమీషన్లకోసం వేధిస్తుంటే, ఎవరువస్తారు? టీడీపీప్రభుత్వంలో రాయలసీమకు ఎన్నిపరిశ్రమలు వచ్చాయి. తిరుపతి, రేణిగుంట ప్రాంతా ల్లో లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు అనేకపరిశ్రమలు తీసుకొచ్చా డు. వైసీపీప్రభుత్వ నిర్వాకంతో గతంలో తాముచేసుకున్న రూ.16వేలకోట్ల పారిశ్రామిక ఒ ప్పందాలు మురిగిపోయాయి. రాష్ట్రంలో కొత్తపరిశ్రమలు వస్తే, తమవ్యాపారాలు సాగవన్నదే వైసీపీనేతల కుట్ర. వారుచేసే అక్రమ వ్యాపారాలు సక్రమంగా ఉండాలన్నదే వారి ఆలోచన. మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి ఎన్నిఉద్యోగాలు ఇచ్చాడంటే సమాధానంలేదు. వాలంటీర్ ఉద్యోగాలు ప్రభుత్వఉద్యోగాలు కావని వారే అన్నారు. వాలంటీర్లు కూడా చాలీచాలని జీతంతో పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు..మూడేళ్లుదాటినా దా ని ఊసేలేదు. పేదరికనిర్మూలనలో రాష్ట్రం గతంలో 2వస్థానంలో ఉంటే, ఇప్పుడు 10వ స్థానా నికి చేరింది. పేదరికనిర్మూలనలో రాష్ట్రం 10వస్థానానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ప్రజల్ని ఉద్ధరిస్తున్నట్టా?

సంక్షేమపథకాల అమలు సక్రమంగా ఉంటే రాష్ట్రం, అన్నిస్థానాల్లో అధోగతిలో ఎందుకు ఉంటుంది?పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగితేనే తమకు లాభం అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ప్రభుత్వఖాజానాలో రూపాయిలేదు. అప్పులభారంతో ప్రజల జీవనప్రమాణా లు దారుణంగా దెబ్బతిన్నాయి. భవిష్యత్ లోకూడా అప్పులనుంచి రాష్ట్రంకోలుకోలేని విధం గా జగన్ సర్వనాశనంచేశాడు. మూడున్నరేళ్లలో సంక్షేమం, అభివృ ద్ధిని పూర్తిగా విస్మరించాడు. బడ్జెట్లో రూ.30వేలకోట్లు అభివృద్ధికి కేటాయించామంటు న్న సర్కార్, ఖర్చుమాత్రం రూ. 6వేలకోట్లే అనిచెబుతోంది. అంత వ్యత్యాసం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధిఎలా సాధ్యమవుతుంది ? రోడ్లువేయాలన్నా… బ్రిడ్జీలు నిర్మించాలన్నా.. ప్రభుత్వ భవనాలుకట్టాలన్నా ఎలాంటి అభివృద్ధిపనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ముం దు పనులు చేయండి..తరువాత డబ్బులిస్తాం అంటే ఎవరువస్తారు? జగన్ రెడ్డిప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంపై రూ.11లక్షలకోట్ల అప్పులభారం పడనుంది. ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ 2.57లక్షలకోట్లు.దానిలో 10శాతం ఖర్చుకాదు.. మిగిలినదానిలో సగం అప్పులకు వడ్డీలుకట్టడానికే సరిపోతుంది. మిగిలినసొమ్ముతో ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేయాలి? భవిష్యత్ గురించిన ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏకోశానాలేదు. బడ్జెట్లోని కేటాయిం పులు, అప్పులతాలూకాసొమ్ము, ప్రజలనుంచి వసూలుచేస్తున్నదంతా ఎటుపోతోంది అంటే ప్రభుత్వం సమాధానంచెప్పదు. ఆ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా.. ఇడుపులపా యలోఉందా.. లోటస్ పాండ్ లో ఉందా.. బెంగుళూరు ప్యాలెస్ లో దాచారా?

గూగుల్ టేకౌట్ అంటే ఏమిటో సజ్జలకు తెలుసా? బురదజల్లే ఆరోపణలతో సీబీఐ విచారణను పక్కదారి పట్టించాలన్నదే ప్రభుత్వ ఆలోచన 
వివేకాహత్యకు చంద్రబాబుకి ఏంటిసంబంధం? హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని కోరిన జగన్, ముఖ్యమంత్రికాగానే కోర్టులో వేసిన పిటిషన్ కూడా ఎందుకు వెనక్కుతీసుకు న్నాడు? సీబీఐ విచారణకావాలన్నవారు ఈనాడు సీబీఐ సరిగా విచారించడంలేదు..ఎవరో చెప్పినట్టు నడుస్తోంది అని ఎలా అంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే నిజాలు ప్రజలకు తెలియకుండా పోతాయా? హత్యజరిగిన వెంటనే ప్రాథమికసాక్ష్యాధారాలను రూపుమాపారని, విచారణలో ఒక్కొక్కటి బయటకువస్తుందని సీబీఐ చెబుతుంటే, సదరు విచారణసంస్థపై బురదజల్లేలా మాట్లాడటం ఏమిటి? గూగుల్ టేకౌట్ అంటే ఏమిటో, అసలు ఆ వ్యవస్థఎలాంటిదో సజ్జలకు తెలుసా? గూగుల్ పరిజ్ఞానానికి టీడీపీకి ఏమిటి సంబంధం? అవినీతి, అక్రమాలతో పూర్తిగా మునిగిపోయి, ఏంచేయాలో పాలుపోక దిక్కుతోచనిపరిస్థితు ల్లో ఉన్నప్పుడు ఇలానే ప్రతిపక్షాలను దూషిస్తూ, ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. సజ్జల, ఆయన ప్రభుత్వం ఎంతగా గింజుకున్నా సీబీఐ వివేకాహత్యకేసులోని అసలు దోషు ల్ని పట్టుకొనే తీరుతుంది. రాష్ట్రాన్ని దొంగలరాజ్యంగా, దౌర్జన్యాలకేంద్రంగామార్చారు. దివాలాకోరులు, దోపిడీదారులకు అడ్డాగా మార్చారు. అప్పులకుప్పగా మార్చి, అయినకా డికి దోచేస్తున్నారు. ఎటుచూసినా కబ్జాలు.. దోపిడీలే. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యి..తమను ఎక్కడ నిలదీస్తారోనన్నభయంతో చివరకు సీబీఐ విచారణను తప్పుపట్టేస్థాయికి దిగజా రారు.

యువతసమస్యలు..రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర సాగుతోంది
60ఏళ్లలో ఏప్రభుత్వం చేయనన్ని అప్పులు మూడేళ్లలో జగన్ రెడ్డిచేశాడు
లోకేశ్ పాదయాత్ర బ్రహ్మండంగా జరుగుతోంది. యువతలోని నిరాశా,నిస్పృహల్ని పసిగట్టి, వారికి అండగానిలవడమే లక్ష్యంగా లోకేశ్ యాత్రచేస్తున్నాడు. ఆయన గుర్తించేసమస్యలనే టీడీపీమేనిఫెస్టోలో ప్రధానాంశాలుగా పెట్టబోతున్నాం. చదువుకున్నవారితోపాటు, చదువులే నివారికి కూడా ఆదాయంలేకుండా పోయింది. చేతి, కులవృత్తులవారు, నైపుణ్యం ఉన్నవా రు కూడా తీవ్రనిరాశానిస్పృహల్లో ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రధాన సమస్య నిరుద్యోగమే . ప్రభుత్వఉద్యోగాల భర్తీనేలేదు. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.. తాను అధికారంలోకి వచ్చినవెంటనే వాటిని భర్తీచేస్తానన్న జగన్, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? యువతని మత్తుపదార్థాలకు ఎందుకు బానిసల్ని చేస్తున్నారు?
వారు చైతన్యవంతులైతే తమకు పుట్టగతులు ఉండవన్నదే జగన్ అండ్ కో భయం. తమప్రభుత్వం నిరుద్యోగభృతి ఇస్తే అవహేళనచేసిన జగన్ రెడ్డి..దాన్ని రద్దుచేసి, యువతను నిర్వీర్యంచేసి, ఎందుకు పనికి రానివారిగా మార్చేస్తున్నాడు. రాష్ట్రంలో స్వయంఉపాధి పథకాలు ఏవీ అమల్లో లేవు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలయువతకు ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం రూపాయి స్వయం ఉపాధిరుణం ఇచ్చిందా? లోకేశ్ గానీ, చంద్రబాబుగానీ మాట్లాడితే ప్రభుత్వం ఎందుకు ఓర్వలేకపోతోంది. పాలకుల తప్పుల్ని ఎత్తిచూపడమే ప్రతిపక్షం, మీడియా యొక్కప్రధాన బాధ్యత. ఆ పనిచేస్తే తాము ఒప్పుకోమని పోలీసులతో అడ్డుకుంటే, పరిపాలిస్తున్నవారు భవిష్యత్ లో దారుణమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మీరు ఒకటికొడితే, మేంకచ్చితంగా రెండు కొడతాం..అందులో సందేహమేలేదు. 1956 నుంచి 2018 వరకు ఉమ్మడిరాష్ట్రంగానీ, విభజనానంతర రాష్ట్రంగానీ చేసిన అప్పులు మొత్తం రూ.2.56 లక్షలకోట్లు. టీడీపీప్రభుత్వమే అన్నీఅప్పులుచేసిందనే మంత్రి బుగ్గన మాటలు పచ్చి అబద్ధా లు. బుగ్గన వ్యాఖ్యలపై బహిరంగంగా ప్రజలమధ్యకు వచ్చి మాట్లాడే ధైర్యం ప్రభుత్వానికి, ఆయనకు ఉన్నాయా? 60ఏళ్లలో ఏప్రభుత్వం చేయనివిధంగా కేవలం మూడున్నరేళ్లలోనే రాష్ట్రఅప్పుల్ని రూ.10లక్షలకోట్లకు చేర్చి, ఆ సొమ్మంతా దిగమింగుతూ, తిరిగి ప్రతిపక్షాలనే నిందిస్తారా? బడ్జెట్లో చూపే అప్పులే రూ.4లక్షలకోట్లుంటే, కార్పొరేషన్లు, ఇతరసం స్థల్ని, ఆస్తులు, భూములు తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల మాటేమిటి? ఎందుకు ఇన్ని అప్పులు చేశారంటే ప్రభుత్వం సమాధానంచెప్పదు. జగన్ రెడ్డి పాలసీ దొంగనోట్లు పంచడం..దొంగఓట్లు వేయడమే. వాటితోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. అదానీషేర్లు కుప్ప కూలినా.. అతనికి జగన్ రెడ్డి చేయాల్సిందంతా చేశాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 చాలా స్పష్టంగా పౌరుల స్వేచ్ఛ, వారిభావప్రకటనా స్వేచ్ఛను చాలాస్ప ష్టంగా వర్ణించాయి. కాలంచెల్లిన బ్రిటీష్ చట్టాలతో జీవోలు తీసుకొచ్చి ప్రతిపక్షం..మీడియా తాముచెప్పంది వినాలంటే ఎవరువింటారు? జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు.. కోర్టులుచెప్పినా.. ఎవరుచెప్పినా వినడు. రాజారెడ్డి చరిత్రను గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి మక్కీకి మక్కీ అలానే ప్రవర్తిస్తున్నాడని చెప్పొచ్చు. తెలుగుదేశం జనసేన కలిస్తే తనపీఠం కదులుతుందన్న భయం జగన్మో హన్ రెడ్డిలో బాగాఉంది. రెండుపార్టీల కలయికతో ఎలాంటి పర్యవసానాలు ఉత్పన్న మవు తాయో నాకంటే జగన్మోహన్ రెడ్డే బాగాచెప్పగలడు.”

Leave a Reply