తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఎల్ మల్లయ్య మృతి

తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఎల్ మల్లయ్య (85) శనివారం మధ్యాహ్నం హైదరాబాదులో గుండెపోటుతో మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ గా, కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిషరీస్ మెంబర్ గా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ (ఎన్ఏఎఫ్) చైర్మన్ గా పలు ఎన్నో పదవులను అలంకరించిన దివంగత ఏ.ఎల్ మల్లయ్య నల్లగొండ జిల్లా, నల్లగొండ మండలం, నర్సింగ్ బట్ల గ్రామంలో 1938 మే 25తేదీన జన్మించారు. 1955లో స్వగ్రామం నుంచి కాలినడకన హైదరాబాదుకు వచ్చిన ఏ.ఎల్ మల్లయ్య 1956 సంవత్సరంలో ఆర్య సమాజ్ లో చేరి సేవలందించారు. ఆనాడు హైదరాబాద్ ఆర్య సమాజ్ అధినేత రాజ్ పాల్ నాయకత్వంలో 1958 సంవత్సరంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మిత్రులు, శ్రేయోభిలాషులు, గంగపుత్ర సంఘం నాయకులు, సభ్యులు ఆయన పార్దివ దేహానికి నివాళులర్పించేందుకు వీలుగా ఇందిరా పార్క్, బండ మైసమ్మ నగర్ లోని ఆయన స్వగృహంలో పార్థివదేహాన్ని ఉంచారు. దివంగత నాయకుడు ఏ.ఎల్ మల్లయ్య గారి అంత్యక్రియలు ఆదివారం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply