Suryaa.co.in

Andhra Pradesh

విచారణాధికారిగా సీసీఎస్ ఏసీపీ స్రవంతీ రాయ్ నియామకం

-ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాంఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది
-నాలుగైదు రోజుల్లో విచారణ పూర్తవుతుంది

-సీపీ రాజశేఖర్ బాబు

విజయవాడ: నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డీజీపీ ఈ కేసు వివరాలపై ఆరా తీశారని పేర్కొన్నారు.

‘‘స్రవంతి రాయ్ అనే అధికారిని విచారణ కోసం నియమించాం. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుంటాం. చీటింగ్ కేసులో నటితో పాటు కుటుంబం మొత్తాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాం. ఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది. నాలుగైదు రోజుల్లో ఈ విచారణ పూర్తవుతుంది. మొత్తం ఈ కేసులో అన్ని కోణాల్లో సాంకేతికతతో ఆధారాలు సేకరిస్తాం. నివేదిక రూపంలో డీజీపీకి అందచేస్తాం. ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లు తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారు’’ అని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE