Suryaa.co.in

Andhra Pradesh

పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత!

-మట్టి విగ్రహాలను పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
-బిజెపి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి 

తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని తుడా మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రారంభించారు.

తిరుమల శ్రీవారి ఆశీస్సులతో తిరుపతిలో ప్రతినిత్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీ అదే తరహాలో తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా వినాయక చవితి పర్వదినాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్థానిక మండప నిర్వాహకుల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం విఘ్నేశ్వరుని ఆశీస్సులతో దేశం,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని విఘ్నాలు తొలగిపోయి విజయపథంలో దూసుకెళ్లాలని కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.

 

LEAVE A RESPONSE