Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులను టీటీడీ, శ్రీకాళహస్తి ఆదుకోవాలి

– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి

చిత్తూరు: ఏపీ వరద బాధితులకు టీటీడీ, శ్రీకాళహస్తి దేవస్థానాలు ఆదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ నుంచి రూ. 10 కోట్లు, శ్రీ కాళహస్తి దేవస్థానం రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడ , గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పునరావాస కేంద్రాల్లో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆహారం, మంచినీళ్లు, పాలు, దుస్తులు సరఫరా చేసి ఆదుకోవాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. అనారోగ్యం బారిన పడిన రోగులకు, వైద్యం, మందులు ఉచితంగా ఇవ్వాలి. చాలా చోట్ల ప్రజలు ఇంకా వరద ముంపులో ఇరుక్కుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వాహనాలు ఏర్పాటు చేసి, ప్రజలను తరలించాలి.

టీటీడీ ధార్మిక సంస్థ…. ఏపీకి వచ్చిన ఆపదను గుర్తించి, తక్షణ సాయంగా నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ, కృషి ప్రశంసనీయం… అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురూ మంచి అడ్మినిస్ట్రేటర్స్. ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వరద బాధితులకు అండగా నిలిచి, ఆపత్కర సమయంలో ఆదుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఒక నెల జీతభత్యాలను వరద బాధితులకు సాయం కోసం ఖర్చు చేయాలి. టీటీడీ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు వేతనాన్ని ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

LEAVE A RESPONSE